రవితేజ సాంగ్ కు డాన్స్ చేస్తూ గుండెపోటుకు గురై చనిపోయిన యువకుడు

ఇటీవల కాలంలో వయసు తో సంబంధం లేకుండా గుండెపోటులు వస్తున్నాయి. చూస్తుండగానే చనిపోతున్నారు. మొన్నటికి మొన్న నందమూరి తారకరత్న నడుస్తూ..నడుస్తూ గుండెపోటుకు గురై దాదాపు 23 రోజులు మృతువు తో పోరాడి చనిపోయాడు. నిన్నటికి నిన్న ఓ పెళ్లి లో ఓ వ్యక్తి సడెన్ గా కుప్పకూలి చనిపోయాడు. తాజాగా 20 ఏళ్లు కూడా లేని ఓ యువకుడు పాట కు డాన్స్ వేస్తూ కుప్పకూలి చనిపోయాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది.

నిర్మల్ కుభీర్ పార్డీ కే గ్రామంలో ఓ యువకుడు రవితేజ నటించిన ఇడియట్ సినిమాలోని ఓ సాంగ్ కు డాన్స్ వేస్తూ..సడెన్ గా కుప్పకూలిపోయాడు. అప్పటివరకు ఎంతో హుషారుగా డాన్స్ వేస్తూ కనిపించిన యువకుడు..సడెన్ గా మరణించడం అందర్నీ షాక్ కు గురి చేసింది. గుండెపోటు తోనే ఆ యువకుడు మరణించాడని డాక్టర్స్ తెలిపారు. అయితే, దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది.

https://twitter.com/RameshVaitla/status/1629757690460209155?s=20