గుర్రం ఎక్కిన సమంత

సమంత మళ్లీ యాక్టివ్ అయ్యింది. వరుస సినిమాలు , జిమ్ సెంటర్స్ , సోషల్ మీడియా లలో యాక్టివ్ గా ఉంటుంది. గత కొద్దీ రోజులుగా ప్రాణాంతకమైన మయోసైటిస్ వ్యాధితో పోరాడింది. కొన్ని నెలల పాటు సినిమాలకు దూరంగా ఉండి ఈ వ్యాధికి చికిత్స తీసుకుంది సమంత. ప్రస్తుతం వ్యాధి నుండి బయటపడడంతో మళ్లీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అలాగే సోషల్ మీడియా లోను యాక్టివ్ గా ఉంటూ రోజు చేసే పనులను తెలుపుతుంది.

రీసెంట్ గా జిమ్ లో ఎంతగా కష్టపడుతుందో వీడియో చేసిన సామ్..తాజాగా హార్స్ రైడింగ్ చేస్తున్న పిక్ ను పోస్ట్ చేసింది. ‘మీరిద్దరూ అందంతో పాటు మృగం వంటివారు’ అనే క్యాప్షన్ ను జతచేసింది. ఇక సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం గుణ శేఖర్ డైరెక్షన్లో చేఇస్నా శాకుంతలం మూవీ ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో పాటు విజయ్ దేవరకొండ సరసన ఖుషి మూవీ లో నటిస్తుంది.