రామంతాపూర్‌లో కరోనాకు హోమియో మందు

JSPS Government Homeopathic Medical College
JSPS Government Homeopathic Medical College

హైదరాబాద్‌: రామంతాపూర్‌ ప్రభుత్వ హోమయోపతి వైద్య కళాశాల ఆసుపత్రిలో కరోనా వైరస్‌ కారణంగా హోమియో మందు ఆర్స్‌. అల్ట్‌30పిను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్టు ఆయుష్‌ అదనపు డైరెక్టర్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎన్‌. లింగరాజు తెలిపారు. తమ ఫార్మాసీలో తయారుచేసే ఈ మందును రోజుకు ఒక డోసు ఆరు గుళికల చొప్పున మూడు రోజుల పాటు వాడాలని ఆయన వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, హోమియో మందును కళాశాల వద్ద నేరుగా పొందవచ్చని ఆయన పేర్కొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/