పవర్ స్టార్ తో నటించే ఛాన్స్ మీకే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూస్తే చాలు అనుకునే వారికే కాదు యావత్ అభిమానులకు గుడ్ న్యూస్. పవన్ కళ్యాణ్ ను చూడడమే కాదు ఆయనతో కలిసి నటించే ఛాన్స్ కలిపిస్తుంది డీవీవీఎంటర్టైన్మెంట్స్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సెట్స్ ఫై హరిహర వీరమల్లు , ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు తమిళ్ మూవీ రీమేక్ ఉండగా..సాహో డైరెక్టర్ సుజిత్ తో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీ ని ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్​ వర్క్​ వేగంగా జరుగుతోంది.. అయితే చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్​టైనమెంట్స్​ ఈ సినిమాలో కొన్ని విభాగాల్లో పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఒక పోస్టర్ను విడుదల చేసింది. ఆర్ట్, ఫ్యాషన్​, ఎన్​విరాన్​మెంట్​, కాన్సెప్ట్ ఆర్టిస్ట్స్ విభాగాల్లో పనిచేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. దీనికి సంభందించిన ఒక పోస్టర్ ను సైతం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.. ఆ పోస్టర్​లో ఓ పెన్​పై జపనీస్​ భాషలో ఏవో అక్షరాలు రాసి ఉన్నాయి. ఆ పోస్టర్​ కింద ఆసక్తి కలవారు [email protected]కి దరఖాస్తులను పంపించవచ్చని తెలిపింది. ఈ ప్రకటన తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మరి పవన్ తో నటించే ఛాన్స్ ఎవరికీ దక్కుతుందో..