నాసిక్‌లో భారీ అగ్నిప్రమాదం

న్యూ ఇయర్ వేళ నాసిక్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.ఈ ప్రమాదం లో ఒకరు మృతి చెందగా..దాదాపు 19 మంది గాయపడ్డారు. ముండేగావ్ గ్రామంలోని జిందాల్ గ్రూప్ పోలిథిన్ తయారీ యూనిట్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కెమికల్ ప్లాంట్ బాయిలర్‌లో సంభవించిన పేలుడుతో ఒక్కసారిగా మంటలు చెలరేగి పెద్దఎత్తున పొగలు చుట్టుపక్కలకు వ్యాపించాయి. ఇక ఫ్యాక్టరీలో పలువురు చిక్కుకుపోవడంతో అధికారులు తక్షణ సహాయక చర్చలు చేపట్టారు.

అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఒక మహిళను ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూసిందని, వర్కర్లు, సూపర్‌వైజర్ సహా 19 మంది గాయపడ్డారని నాసిక్ ఎస్‌పీ షాహ్జి ఉమాప్ తెలిపారు. నాసిక్ అగ్నిప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీలో చిక్కుకుపోయిన వారిని, గాయపడిన వారిని ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.