నోటి పొక్కులు.. తగ్గాలంటే

చిట్కా వైద్యం

To reduce Mouth blisters.
Mouth blisters.

నోటి పొక్కులు.. చాలా మందికి నోటిపక్కనో, లోపలో పెదవుల అంచుల్లోనో ముందు దురదలా మొదలై చిన్న పొక్కుల్లా వచ్చి, పుండుగా మారి, క్రమంగా ఎండి, చాన్నాళ్లకు తగ్గుతుంటాయి.

నొప్పి సంగతి అలా ఉంచితే ఇవి పట్టాన తగ్గవు. పైగా పెదవులకి పక్కగా మచ్చపడి ఇబ్బందిగా అనిపిస్తుంటాయి. కోల్డ్‌స్టోర్స్‌గా పిలిచే ఈ పొక్కులు వైరస్‌ల కారణంగా వస్తాయి.

అయితే కొన్ని చిట్కా వైద్యాలతో వీటిని త్వరగా తగ్గించుకోవచ్చు.

పొక్కు రావడానికి ముందు దురద మొదలవగనే కొబ్బరినూనెలో దూదిని ముంచి అక్కడ గంటకోసారి పెట్టడం వల్ల అందులోని లారిక్‌ ఆమ్లం, ఓలియాక్‌ ఆమ్లాలు వైరస్‌ను నాశనం చేస్తాయి.

ఐస్‌ క్యూబ్‌తో రుద్దడం వల్ల కూడా దురద తగ్గి, త్వరగా మానుతాయి.

దూదిని హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌లో ముంచి ప్రతి రెండుమూడు గంటలకోసారి పొక్కుల మీద పెడుతుంటే త్వరగా ఎండి రాలి పెద్దగా మచ్చపడకుండా ఉంటాయి.

వెల్లుల్లి రెబ్బలను చిదిమి ఆ రసాన్ని పొక్కు మీద రెండుమూడు రోజులకోసారి పెడితే ఫలితం ఉంటుంది.

లేదంటే పరగడుపున రెండు రెబ్బల్ని తిన్నా అవి త్వరగా తగ్గుతాయి.

లేదంటే చిటికెడు సముద్ర ఉప్పును తీసుకుని దాన్ని ఆ పొక్కుల మీద అరనిమిషం పాటు గట్టిగా నొక్కి పెట్టాలి. ఇలా రోజుకి రెండుమూడు సార్లు చేసినా అవి త్వరగా ఊడి వస్తుంటాయి.

రోజుకు రెండుసార్లు తేనెను పొక్కుల మీద రాసి, ఏడెనిమిది నిమిషాలాగి కడిగేసినా మంచిదే.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/