30 రోజుల్లో ఎస్ బ్యాంకును కాపాడే పథకం సిద్ధం

ఎస్‌ బ్యాంకు 49శాతం వాటా కొనుగోలుకు ఎస్‌బీఐ ఆమోదం

SBI Chairman
SBI Chairman

ముంబయి: సంక్షోభంలో ఉన్న ఎస్‌ బ్యాంకులో 49 శాతం వాటా కొనుగోలుకు తమ బ్యాంకు బోర్డు సూత్ర ప్రాయ ఆమోదం తెలిపిందని ‘ఎస్‌బీఐ’ చైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ ప్రకటించారు. 30 రోజుల గడువు లోపే ఎస్ బ్యాంకును కాపాడే పథకాన్ని సిద్ధం చేస్తామని, ఇందుకోసం తాము 24 గంటలూ పని చేస్తామని తెలిపారు. బ్యాంకులో ఖాతాదారుల నగదు భద్రంగా ఉంటుందని, ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు. బ్యాంకు పునర్నిర్మాణ ముసాయిదా తమ వద్దకు చేరిందని, దీనిపై తమ పెట్టుబడిపై ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రాథమికంగా రూ.2450 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. దీనిపై తమ తుది నిర్ణయాలను రెగ్యులేటరీలకు అందిస్తామని చెప్పారు. మూడు సంవత్సరాల కాలానికి రూ.5500 కోట్లుగా పెట్టుబడి ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. మార్చి 9 లోపు తమ ప్రతిపాదనలను ఆర్‌బీఐ ముందు ఉంచుతామన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/