కరోనా నేపథ్యంలో ఈటలపై కుటుంబం చిరుకోపం

ఆసక్తికర వ్యాఖ్యలను వెల్లడించిన మంత్రి ఈటల రాజేందర్‌

Etela Rajender
Etela Rajender

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వైరస్‌ ప్రభావం మెల్లగా తగ్గుతూ వస్తుంది. కరోనా అనుమానిత కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లాబీలో కాసేపు మీడియా వారితో మాట్లాడారు. తన కుటుంబ సభ్యులు తనను ఏమంటున్నారో వెల్లడించారు. మీరు నిత్యం ఎక్కడికంటే అక్కడికి వెళుతున్నారు, కరోనా అనుమానితులతో సన్నిహితంగా మెలుగుతున్నారు, అలాగే ఇంటికి వస్తే ఊరుకునేది లేదు…. శుభ్రంగా ఆఫీసులోనే స్నానం చేసి అప్పుడు ఇంటికి రండి అని మా వాళ్లు అంటున్నారుఖి అని ఈటల వివరించారు. పైగా తాను మాస్కు లేకుండానే తిరుగుతుండడం పట్ల కూడా వివరణ ఇచ్చారు. కరోనా ఉన్నప్పుడే మాస్కు ధరించాలని, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఆ తుంపర్లు ఇతరులపై పడకుండా ఉండేందుకే మాస్కు అని తెలిపారు. కరోనా లేనప్పుడు మాస్కు ఎందుకని ప్రశ్నించారు.

తాజా ఇంగ్లీష్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/english-news/