కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందిః యడియూరప్ప

బిజెపి అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తుందని స్పష్టీకరణ

yediyurappa-alerts-telangana-people-over-congress-guarantees

హైదరాబాద్‌ః తెలంగాణ ఆరు గ్యారెంటీలు అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోందని, కానీ ప్రజలు మోసపోవద్దని బిజెపి నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప అన్నారు. బిజెపి తరఫున ప్రచారం చేయడానికి హైదరాబాద్‌కు వచ్చిన ఆయన… మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… కర్ణాటకలో ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విఫలమైందన్నారు. అక్కడ ఐదు హామీలను అమలు చేయలేకపోయిందని, తెలంగాణ ప్రజలు ఆరు హామీలతో మోసపోవద్దని హెచ్చరించారు. కర్ణాటక ప్రజలను మోసం చేసిన సిద్ధరామయ్య ప్రభుత్వం దివాలా దిశగా నడుస్తోందని తెలిపారు. బిజెపి అధికారంలోకి వస్తే ఇక్కడ బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పారు.