సభ ప్రాంగణానికి చేరుకున్న జనసేనాధినేత

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మచిలీపట్నం సభ ప్రాంగణానికి చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 05 గంటలకు చేరుకోవాల్సి ఉండగా..ట్రాఫిక్ జాం కారణంగా ఆలస్యమైంది. ఇంత అలసమైనప్పటికీ కార్యకర్తలు , అభిమానులు , వీరమహిళలు, పెద్దవారు ఎలా ఎవ్వరు కూడా ఏమాత్రం నిరాశ చెందకుండా అదే ఉత్సాహం తో ఉన్నారు. ప్రస్తుతం ఆత్మ హత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు చెక్స్ అందజేస్తున్నారు పవన్.

ఈ పంపిణి అవ్వగానే ప్రసంగించనున్నారు. చాల ఆలస్యం కావడం తో పవన్ కూడా తన స్పీచ్ ను త్వరగా పూర్తి చేయాలనీ అనుకుంటున్నారు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో పవన్ కళ్యాణ్ ఆటో నగర్ నుండి తన వారాహి వాహనం తో ర్యాలీగా బయలుదేరారు. అడుగడుగునా ఆయన అభిమానులు , కార్యకర్తలు , ప్రజలు నీరాజనాలు పలికారు. రోడ్ వెంట వేలాదిమంది ర్యాలీ గా రావడం తో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.