జీడీపీలో 10 శాతం పెరుగుదల ప్రశ్నార్థకమే?

కేంద్రం నుంచి రావల్సిన పన్నుల వాటా రావడం లేదు

buggana rajendranath reddy
buggana rajendranath reddy

అమరావతి: కేంద్ర బడ్జెట్‌పై వైఎస్సార్‌సిపి అసంతృప్తి వ్యక్తం చేసింది. బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం చేశారని వైఎస్సార్‌సిపి నేతలు ఏకరువు పెడుతున్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా రావడంలేదని, దేశ స్థూల ఉత్పత్తి 10శాతం ఉంటుందని కేంద్రం అంచనా వేస్తోందన్నారు. జీడీపీలో 10శాతం పెరుగుదల ప్రశ్నార్థకమేనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. సుమారు రూ.8లక్షల కోట్ల అప్పులు చూపిస్తున్నారని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనది ఐదో పెద్ద దేశమని మంత్రి పేర్కొన్నారు. అమెరికాది 21 ట్రిలియన్‌ డాలర్లు అయితే.. మనది 3 ట్రిలియన్‌ డాలర్లని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.2లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారని బుగ్గన చెప్పారు. జీఎస్టీ ప్రకారం రాష్ట్రాలకు రీయింబర్స్‌మెంట్‌ చేయాలని కోరారు. దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని, వ్యవసాయరంగానికి గోడౌన్లు పెంచాలన్నది మంచి నిర్ణయమేనని బుగ్గన వ్యాఖ్యానించారు. స్వయం సహాయక బృందాలకు ముద్ర రుణాలు మంచిదేనని చెప్పారు. ఆయుష్మాన్‌ భారత్‌ కింద జిల్లాల్లో ఆస్పత్రుల నిర్మాణం మంచిదని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కితాబిచ్చారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/