అసలు సూత్రధారులను శిక్షించాలి: లోకేశ్

వైస్సార్సీపీ నేతల భూకబ్జాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది

అమరావతి: వైస్సార్సీపీ నాయకుల భూకబ్జాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. అనంతపురం జిల్లా అక్కంపల్లికి చెందిన రైతు లక్ష్మీరెడ్డి గారి కుటుంబం మొత్తం వారికి జీవనమైన పొలంలోనే ఆత్మహత్యాయత్నం చేశారంటే వైస్సార్సీపీ దుర్మార్గుల అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధమవుతోందని అన్నారు. వైస్సార్సీపీ నేతలు, స్థానికంగా ఉన్న కొంతమంది అధికారులు కుమ్మకై రైతు భూమి కొట్టేయాలని కుట్రలు చెయ్యడం దారుణమని చెప్పారు. దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులను శిక్షించి రైతు లక్ష్మీరెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/