చంద్రబాబుపై వైస్సార్సీపీ నేతల బూతులు ..

టీడీపీ అధినేత . మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫై వైస్సార్సీపీ నేతలు బూతుల వర్షం కురిపిస్తున్నారు..మా బొచ్చు పీకాలని మాజీ మంత్రి అంటే..ఈక కూడా పీకలేరని ప్రస్తుత మంత్రి అనడం ఫై ప్రజలు సైతం ఛీ కొడుతున్నారు. పదవుల కోసం మీడియా ముందు ఇలా మాట్లాడడం సరికాదని అంటున్నారు. వైస్సార్సీపీ లో బూతులు కేరాఫ్ అంటే కొడాలి నానే అని అంత అంటారు. తాజాగా గుడివాడ రూరల్ మండలం బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి కొంద‌రు వైసీపీ కార్య‌క‌ర్త‌లు.. ఆ పార్టీ జెండా రంగులు వేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. దీనిపై టీడీపీ శ్రేణులు కొడాలి నాని ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నాని స్పందించారు. ఎన్టీఆర్ టీడీపీ సొత్తు కాదని, ఆయన జాతి సంపద అని, ఎన్టీఆర్ ఫొటోను ఎవరైనా వాడుకోవచ్చని నాని అన్నారు. బొమ్మలూరులో నా సొంత డబ్బుతో ఎన్టీఆర్ విగ్రహాన్ని నేనే ఏర్పాటు చేశా అన్నారు. గుడివాడ నియోజకవర్గం మొత్తం ఎన్టీఆర్, వైఎస్సార్ విగ్రహాలను ఏర్పాటు చేసి వైసీపీ రంగులు వేయిస్తా. ఎవరేం చేస్తారో చూస్తా అంటూ హెచ్చరించారు.

2024లో నేను మళ్ళీ గెలుస్తా..అప్పుడు చంద్రబాబు మా బొచ్చు పీకాలని ఎద్దేవా చేశారు. పేర్ని నాని నా గురువు అని… పిల్లల చదువు కోసం చంద్రబాబు ఐదేళ్ళ హయాంలో 5 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదని పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్ 420 గాళ్ళు అని.. పేద పిల్లల కోసం మూడేళ్ళలో 16 మెడికల్‌ కాలేజీలు కడుతుంటే ఈ గుడ్డి వాళ్ళకు అభివృద్ధి కనిపించటం లేదట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే టీడీపీ ఆత్మకూరులో ఎందుకు పోటీ చేయలేదు?? చంద్రబాబు చవట దద్దమ్మ అని , 2019లో నీ దత్త పుత్రుడిని రెండు చోట్ల తుక్కు తుక్కు గా ఓడించామని.. నీ సొంతం కుమారుడిని మంగళగిరిలో ఓడించాం..వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును కుప్పంలో ఓడించి తీరుతామని హెచ్చరించారు. గుడివాడ కొడాలి నాని అడ్డా.. చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ ఈక కూడా పీకలేరని మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడివాడను ఎవరూ చెక్కు చెదర్చలేరని.. కార్యకర్తల కష్టం, పోరాట ఫలితంగానే ఈ ప్రభుత్వం ఏర్పడిందని పేర్కొన్నారు. మరో 25 ఏళ్లు జగనే సీఎం అని… చంద్రబాబు గుడివాడకు వచ్చి ఏం చెప్తాడని నిలదీశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లే కాదు ఇంకెంతమంది వచ్చిన ఈక కూడా పీకలేరని అన్నారు. గుడివాడకు ఒక బ్రాండ్ తెచ్చిన వ్యక్తి కొడాలి నాని అని.. గుడివాడలో కొడాలి నానిని ఓడించటం కాదు కదా అసలు టీడీపీ నుంచి నిలబడే వ్యక్తి ఎవరు?? అని ప్రశ్నించారు పేర్ని నాని. మొత్తం మీద వైస్సార్సీపీ నేతల మాటలు టీడీపీ శ్రేణులనే కాదు ప్రజలకు సైతం నచ్చడం లేదు. విమర్శలు చేసుకోవచ్చు కానీ మరి బూతులు అనాల్సిన అవసరం లేదని అంటున్నారు.