కరాచీ బేకరీలో పేలుడు..ఆరుగురి పరిస్థితి విషమం

పేలుడు శబ్దానికి ఉలిక్కి పడిన చుట్టుపక్కల వారు

cylinder-blast-in-rajendra-nagar-karachi-bakery

హైదరాబాద్ః హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని కరాచీ బేకరీలో పేలుడు సంభవించింది. బేకరీలోని సిలిండర్ పేలడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 15 మంది కార్మికులకు గాయాలయ్యాయి. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో బేకరీలోని పరిస్థితి దారుణంగా తయారయింది. పేలుడు శబ్దానికి చుట్టుపక్కల వారు ఉలిక్కిపడ్డారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు.