ఉజ్వల యోజన 2.0 ని ప్రారంభించిన ప్రధాని

PM Narendra Modi launches Ujjwala Yojana 2.0

న్యూఢిల్లీ : ఉజ్వల 2.0 ఎల్పీజీ కనెక్షన్స్ స్కీమ్‌ను ప్రధాని నరేంద్రమోడీ నేడు ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లా నుంచి ఈ పథకాన్ని ప్రధాని వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఉజ్వల యోజన-2021ను గ్రామీణ ప్రాంతాల్లోని లక్షలాది కుటుంబాలకు ముఖ్యంగా బలహీన వర్గాలకు ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చే ఉద్దేశంతో ప్రారంభించారు. ఉజ్వల స్కీమ్ తొలి విడతలో అవకాశం రాని వారిని పరిగణనలోకి తీసుకుని 2.0 స్కీమ్‌ను ప్రధాని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఉజ్వల స్కీమ్ లబ్ధిదారులతో ప్రధాని మాట్లాడారు. ఈ పథకం ద్వారా మరిన్ని కుటుంబాలకు ఎల్‌పీజీ కనెక్షన్లు ఇస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మహోబా నుంచి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా పాల్గొన్నారు. మొదటి విడతగా యూపీలోని పేద కుటుంబాలకు 1,47,43,862 ఎల్‌పీజీ కనెక్షన్లు ఇచ్చారు. ఉజ్వల 2.0 స్కీమ్‌ను 2021-22 కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/