సిఎం కెసిఆర్‌కు ప్రధాని మోడి జన్మదిన శుభాకాంక్షలు

హైదరాబాద్‌: నేడు సిఎం కెసిఆర్‌ జన్మదిన సందర్భంగా ప్రధాని మోడి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సిఎం కెసిఆర్‌ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. సిఎం కెసిఆర్‌కు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌ సహా పలువురు మంత్రులు శుభాకాంక్షలు చెప్పారు. కెసిఆర్‌ సారథ్యంలో దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కల నెరవేరిందని, భావితరాల బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/