రేపు ఏపీలో పర్యటించనున్న కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

రేపు విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్-2 ప్రారంభం.. సీఎం జగన్‌ తో కలిసి హాజరు కానున్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ..

అమరావతి : కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ రేపు (ఫిబ్రవరి17) ఏపీలో పర్యటించనున్నారు. సీఎం జగన్‌ తో కలిసి ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మొదట విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియానికి చేరుకుంటారు. జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ రాష్ట్రంలో రూ.11,157 కోట్లతో నిర్మించిన 20 రహదారులు, ఇతర ప్రాజెక్టులను సీఎం జగన్‌తో కలిసి ప్రారంభిస్తారు. అదేవిధంగా రూ.10,401 కోట్లతో నిర్మించనున్న 31 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు వర్చువల్ గా భూమిపూజ చేయనున్నారు . ఈ సందర్భంగా మున్సిపల్‌ స్టేడియంతో నిర్వహించే బహిరంగ సమావేశంలో జగన్‌తో కలిసి ప్రసంగించనున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/