‘యశోద’ రిలీజ్ డేట్ ఫిక్స్

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న యశోద చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. హ‌రీష్ శంక‌ర్‌, హ‌రీష్ నారాయ‌ణ్ సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విడాకుల తర్వాత వరుస సినిమాలతో బిజీ గా సామ్..రీసెంట్ గా ‘క‌తు వాకుల రెండు కాద‌ల్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధించింది. ఇక తెలుగు విషయానికి వస్తే..మూడు సినిమాల‌లో న‌టిస్తుంది.

అందులో ‘య‌శోద’ ఒక‌టి. గ‌తేడాది ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకొని చాల రోజులే అవుతుంది. సరైన టైం చూసి రిలీజ్ చేయాలనుకున్న మేకర్స్..నవంబర్ 11న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు అధికారిక ప్రకటన చేసారు. ఈ మేరకు సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు.