ఢిల్లీ సర్కార్‌ సంచలన నిర్ణయం : థియేటర్స్, షాపింగ్ మాల్స్ మూసివేత

దేశంలో ఓమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఢిల్లీ లో రోజు రోజుకు కేసుల సంఖ్య ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. సినిమా హాళ్ల తో పాటు.. షాపింగ్‌ మాల్స్‌, జిమ్‌లు, మల్టీప్లెక్స్‌లు, బాంకెట్ హాల్స్, ఆడిటోరియంలు & స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు తక్షణమే మూసి వేయలని ఆదేశాలు జారీ చేసారు.

అలాగే.. మెట్రో, రెస్టారెంట్లు, బార్‌లు 50% సామర్థ్యంతో నడిపించాలని కేజ్రీవాల్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. ఈ తాజాగా ఆదేశాలు ఇవాళ అర్థరాత్రి నుంచే అమలు కానున్నట్లు సీఎం కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్‌ కర్ఫ్యూ ఉంటుందని సీఎం కేజ్రీవాల్‌ తెలిపారు. మెట్రో, బార్లు, ప్రైవేటు ఆఫీసులు.. 50శాతం సామర్థ్యంతో పనిచేస్తాయి. అలాగే బస్సులు 50శాతం సామర్థ్యంతోనే నడుస్తాయని, ఆటోలు, ట్యాక్సీల్లో ఇద్దరు ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఉంటుంది. వివాహాలు, అంత్యక్రియలకు 20మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు.