హెచ్-‌1బీ వీసాదారులకు శుభావార్త

హెచ్-‌1బీ వీసా, గ్రీన్ కార్డ్‌లపై గడువు పెంపు

హెచ్-‌1బీ వీసాదారులకు శుభావార్త
H-1 B visa

వాషింగ్టన్‌: హెచ్-‌1బీ వీసా వీసాదారులకు అమెరికా ప్రభుత్వం ‌శుభావార్త తెలిపింది. . హెచ్-‌1బీ వీసా కలిగివున్నవాళ్లు, గ్రీన్ కార్డ్‌లు ఉన్నవారు… కరోనా వైరస్ దృష్ట్యా… కొన్ని పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. వారు వెంటనే కాకుండా… కనీసం 60 రోజుల్లో పత్రాలు సమర్పించవచ్చని ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు. కాగా ప్రస్తుతం అమెరికాలో… గ్రీన్ కార్డు కోసం 2.5 లక్షల మంది అప్లై చేసుకోగా, వారిలో హెచ్-‌1బీ వీసా కలిగివున్నవారు 2 లక్షల మంది దాకా ఉన్నారు. వీరికి 60 రోజుల టైమ్ ఇచ్చారు కాబట్టి… విదేశీ వలసదారులపై నిషేధం గడువు (60 రోజులు) పూర్తవగానే… వీళ్లంతా తమ తమ పత్రాల్ని ఆమోదింపజేసుకునేందుకు వీలుకానుంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/