ప్రశాంత్ కిషోర్ బృందంతో కేసీఆర్ భేటీ..

హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. తెరాస పార్టీ కి రాష్ట్రంలో తిరుగులేదని అంత అనుకుంటూ వచ్చారు. కానీ హుజురాబాద్ ఉప ఎన్నిక లో బిజెపి విజయం సాధించడం తో తెరాస నేతల్లో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ షాక్ కు గురయ్యారు. అనేక పధకాలు తీసుకొచ్చిన ప్రజలు మాత్రం తెరాస కు గట్టి షాక్ ఇచ్చారు. ఇక ఇప్పుడు ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర సర్కార్ ఫై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు.

ఇదిలా ఉంటె కేసీఆర్..రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ బృందం ‘ఐ ప్యాక్‌’తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నారనే వార్తలు వైరల్ గా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వివిధ సందర్భాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న విధాన నిర్ణయాలపై ప్రజాభిప్రాయాన్ని సర్వేల ద్వారా సేకరించడంపై చర్చించినట్లు చెబుతున్నారు. ఏడేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో తీసుకున్న నిర్ణయాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం అవుతున్న అంశాలు, పార్టీ యంత్రాంగం పనితీరు వంటి వాటిపై ఐ ప్యాక్‌ ద్వారా సర్వే చేయించాలని టీఆర్‌ఎస్‌ అధినేత భావిస్తున్నట్లు తెలిసింది. ఐ ప్యాక్‌ నుంచి ప్రస్తుతానికి సర్వేలకు సంబంధించిన సేవలు మాత్రమే తీసుకోవాలని, భవిష్యత్తులో అవసరమైతే మరిన్ని విస్తృత సేవలు పొందాలనే యోచనలో కేసీఆర్‌ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ కోసం ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ టీం కేవలం పధకాల..ప్రజాభిప్రాయ సర్వే కోసమే పని చేస్తారా లేక, వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ కోసం పని చేస్తుందా అనేది స్పష్టత రావాల్సి ఉంది.