ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 5,00,000
22 వేలు దాటిన మృతులు
అమెరికాలో ఒక్కరోజునే 11వేల కేసులు నమోదు
స్పెయిన్, ఇటలీలోనూ కల్లోలం

న్యూయార్క్: ప్రపంచంలో ఇంచుమించు అన్నిదేశా లకు విస్తరించిన కరోనా వైరస్ మహమ్మారిలా పట్టిపీడిస్తోంది. దేశాలకు దేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లాయి.
మరికొన్ని దేశాలు తమ ఆర్థికవ్యవస్థలు మరింత మాంద్యంలోకి వెళ్లిపోతాయని అవసర మైన నివారణచర్యలు గరిష్టస్థాయిలోచేపట్టాయి. ప్రపంచంలోనే అతిపెద్ద లాక్‌డౌన్ 21రోజులపాటు భారత్‌లో అమలవుతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటివరకూ అందిన గణాంకాలనుపరిశీలిస్తే కరోనా మృతులు 22,285మందికిపెరిగారు. అమెరికాలో ఒక్క రోజే 13వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. చైనాలోని వుహాన్‌నగరంలో వెలుగుచూసిన ఈ వైరస్ మహమ్మారిలా విస్తరించింది.
క్షణాల్లోనే దేశదేశాలకు వ్యాపించింది. అనేక దేశాల్లోని ప్రభుత్వాలు ఇళ్లనుంచి బైటికి రానీయకుండా ఆంక్షలు విధించాయి. సామాజిక దూరం, ఐసొలేషన్ వల్లే వైరస్‌ను అడ్డుకోవచ్చని పదేపదే నిపు ణులు చెపుతున్నారు.
ఎంత కట్టడికార్యాచరన అమలవుతున్నా వైరస్‌మరణాలు బాధితుల సంఖ్య మాత్రం రోజురోజుకూ పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌సోకినబాధితులసంఖ్య 4.95 లక్షలకు దాటింది.
తాజా ‘నాడి’ వ్యాసాల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/health1/