ప్రపంచ వృద్ధుడు కన్నుమూత

chitetsu-watanabe
chitetsu-watanabe

టోక్యో: జపాన్‌కు చెందిన చిటెట్సు వటనాబె(112) ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డుల్లోకెక్కిన ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారని, మంగళవారం అంత్యక్రియలు నిర్వహించినట్లు గిన్నీస్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు వెల్లడించారు. కొన్ని రోజుల నుంచి జ్వరం, శ్వాస సంబంధ సమస్యల కారణంగా వటనాబె ఆహారాన్ని తీసుకునే పరిస్థితిలో లేరు. చిటెట్సు వటనాబేకు అయిదుగురు సంతానం కాగా..12 మనవళ్లు, 17 ముని మనవండ్లు ఉన్నారు. గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు ప్రతినిధుల వివరాల ప్రకారం… చిటెట్సు వటనాబె 1907లో ఉత్తర జపాన్‌లోని నీగటాలో జన్మించారు. చిటెట్సు వటనాబె అగ్రికల్చర్‌ స్కూల్‌ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత తైవాన్‌లోని దారునిప్పన్‌ మెయిజి షుగర్‌ కంపెనీలో కాంట్రాక్టు పనుల్లో చేరారు. చిటెట్సు 18 ఏళ్లుగా తైవాన్‌లో నివసిస్తున్నారు. శతాధిక వయస్సులోను ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన వటనాబె మృతిపట్ల గిన్నీస్‌ ప్రతినిధుల బృందం విచారాన్ని వ్యక్తం చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/