కాన్‌బెర్రాలో ఎమర్జెన్సీ

Canberra
Canberra

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాను బెంబేలెత్తిస్తున్న కార్చిచ్చు రాజధాని కాన్‌బెర్రా సమీపానికి చేరటంతో ప్రభుత్వం నగరంలో ఎమర్జెన్సీ ప్రకటించింది. కార్చిచ్చు ధాటికి ఉష్ణోగ్రతలు అసాధారణ రీతిలో పెరిగిపోవటంతో విపరీతమైన ఈదురుగాలులు వీస్తుండటంతో దానిని అడ్డుకోవటం అగ్నిమాపక సిబ్బందికి తలకు మించిన భారంగా మారుతోంది. ఈ వారాంతానికి కార్చిచ్చు ముప్పు మరింత పెరిగే సూచనలు కన్పిస్తుండటంతో ఎమర్జెన్సీ ప్రకటించాలన్న నిర్ణయం తీసుకున్నట్లు ఆస్ట్రేలియా రాజధాని ప్రాంత (ఎసిటి) ముఖ్యమంత్రి ఆండ్రూ బార్‌ చెప్పారు. ఎసిటి దక్షిణ ప్రాంతంలో 185 చ.కి.మీ విస్తీర్ణంలో విస్తరించిన మంటలు అదుపులోకి రాకపోవటంతో పొంచి వున్న ముప్పును ఎదుర్కొనేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. అనూహ్యరీతిలో విస్తరిస్తున్న మంటలను అదుపు చేయటం అసాధ్యమవుతోందని బార్‌ మీడియాకు వివరించారు.

తాజా బడ్జెట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/budget/