సమగ్ర భావాల సమైక్య చిత్రం ఫొటోగ్రఫీ

నేడు ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవం

World Photography Day
World Photography Day

అందమైన జ్ఞ్ఞాపకాలు, తియ్యటి అనుభూతు లు, మధుర ఘట్టాలు, విషాద సన్నివేశాలు, వెలకట్టలేని దృశ్యా లను పదికాలాలపాటు పదిలంగా మన కళ్ల ముందు ఉంచేది ఫొటో.

జీవితంలో అత్యంత సంతోషకర మైన క్షణాలను, గత స్మృతులను నెమరవేసుకోవడం ఫొటోలతోనే సాధ్యం.వంద మాటలతో చెప్పలేనిది ఒక్క ఫొటోతో చెప్పొచ్చు.

ఎన్నో భావాలను ఒక్క చిత్రంతో తెలిపే గొప్పదనం ఫొటోగ్రఫీకి ఉంది.

ఫొటోగ్రఫీకి శతాబ్దాల చరిత్ర ఉంది. రసాయనాలతో రూపొందించిన ప్లేటుపై కాంతిచర్యతో ఓ రూపాన్ని బంధించడాన్ని ఫొటోగ్రఫీ అంటారు. రెండు గ్రీకు పదాల కలయికే ఫొటోగ్రఫీ. ఫొటో అంటే చిత్రం. గ్రఫీ అంటే గీయడం అని అర్థం.

ఫొటోగ్రఫీ అంటే కాంతితో చిత్రాన్ని గీయడం.

18వ శతాబ్దంలో పారిస్‌లో నలుపుతెలుపులతో ప్రారంభమైన ఛాయా చిత్రం కాలక్రమంలో రంగులు అద్దుకుంటూ కొత్తపుంతలు తొక్కు తోంది.

ఫ్రాన్స్‌కు చెందిన లూయిస్‌ జె.ఎం డాగ్యురే 1837 ఫొటోగ్రఫీ ప్రాసెస్‌ను కనుగొన్నారు. అంతకుముందు 1826లో ఫ్రాన్స్‌కు చెందిన జోసెఫ్‌ నైసిఫోరా నీప్సీ ఫొటోగ్రఫీ చరిత్రలో తొలిసారిగా ఛాయాచిత్రాన్ని తయారు చేశారు.

ఇంటి వెనుక పెరట్లో 8 గంటల పాటు ఛాయాచిత్రాన్ని సిల్వర్‌ అణువ్ఞలు ఉన్న ప్లేట్‌పై బంధించారు. కానీ దానిని ఎక్కువ రోజులు నిల్వ చేయలేకపోయారు.

1839 జనవరి 9న ఫెంచ్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ డాగ్యూరే టైప్‌ ప్రాసెస్‌ను అధికా రికంగా ప్రకటించింది.

తర్వాత కొద్ది నెలలకు 1839 ఆగస్టు 19న ఫ్రాన్స్‌ ప్రభుత్వం ఫొటోగ్రఫీపై పెటెంట్‌ హక్కులను కొను గోలు చేసి దానిని ప్రపంచానికి ఉచిత బహుమతిగా అందించింది.

అందుకే ఏటా ఆగస్టు 19ని ప్రపంచ ఫొటో గ్రఫీ దినోత్సవం గా జరుపుతున్నారు. ఇండియా ఇంటర్నేషనల్‌ ఫొటోగ్రఫీ కౌన్సి ల్‌ 1991 నుంచి దేశంలో ప్రతియేటా ఆగస్టు 19న ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని జరపడం ప్రారంభించింది.

మనదేశంలో1857 వరకు కూడా ఫొటోగ్రఫీ అందుబాటులోకి రాలేదు. కేవలం బ్రిటిష్‌రాజు, జమిందారులు, సిపాయిలు మాత్రమే దీన్ని ఉపయోగించేవారు.

1877 నుంచి ఫొటోగ్రఫీ సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది. దేశంలో మొట్టమొదటిసారిగా లాలా దీనదయాల్‌ శ్రీకారం చుట్టారు.

ఫొటోగ్రఫీకి ప్రాణమైన కెమె రాలు మొదట్లో చాలా పెద్దసైజుల్లో డబ్బా అంత ఉండేవి. ఆ పరికరాల ధర తక్కువే అయినా మానవ కృషి, నైపుణ్యంపైనే ఫొటోగ్రఫీ అధారపడి ఉండేది.

మొదట్లో ఎయిమ్‌ అండ్‌ షూట్‌ కెమెరాలు వాడుకలో ఉండేవి. ఇవి ఆకారంలో పెద్దగా ఉన్నా కొద్ది దూరంలోని వస్తువులనే కెమెరాలలో బంధించగలిగేవి.

తర్వాత ఫీల్డ్‌ కెమెరాలు వచ్చాయి. ఇవే నల్లగుడ్డతో ముసుగు వేసుకొని ఫొటోతీసే కెమెరాలు. కేవలం రెండు ఫిల్ములు మాత్ర మే ఉండి, అవి కూడా పలకలంత సైజులో ఉండటం వల్ల కేవ లం రెండు ఫొటోలు మాత్రమే తీసేందుకు వీలుండేది.

దీనివల్ల మోత బరువు తప్ప ఫొటోల నాణ్యత కూడా అంతంతమాత్రంగా నే ఉండేది. ఆ తర్వాత టిఎల్‌ఆర్‌ (ట్విన్‌లెన్స్‌ రిఫ్లెక్టర్‌) కెమె రాలు వచ్చాయి.

మెడలో కెమెరా వేసుకొని కిందికిచూస్తూ ఫొటో లు తీసేవారు.ఎస్‌ఎల్‌ఆర్‌ (సింగిల్‌ లెన్స్‌ రిఫ్లెక్టర్‌) కెమెరాలు వచ్చిన తర్వాత 35 ఫొటోలు తీసే సామర్థ్యం వచ్చింది.

ఇందు లో లెన్స్‌ మార్చుకునే సదుపాయం వచ్చింది.

ఆ తర్వాత డిజి టల్‌ కెమెరాల రాకతో ఫొటోగ్రఫీకి నిర్వచనమే మారిపోయింది. చిన్న సైజు మెమొరీకార్డుతో వందలాది ఫొటోలుతీసే సామర్థ్యం, స్పష్టమైనరంగుల్లో అద్భుతమైన ఫొటోలు తీసే నైపుణ్యం అంద రికీ అందుబాటులోకి వచ్చింది.

వైడ్‌, టెలిలెన్స్‌ రెండింటికీ డిజి టల్‌ టెక్నాలజీ జోడించి ఛాయాచిత్రాలను నిమిషాల్లో అంద చేసేందుకు ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతోంది.

World Photography Day

గతంలో చదువ్ఞలు, ఉద్యోగాల కోసం దిగే పాసుపోర్టు సైజు ఫొటో మొదలుకొని నేడు నిలువెత్తు సైజుల ఫ్లెక్సీవరకు వ్యాపించింది. కేవలం పట్టణ వాసులనే కాకుండా గ్రామీణులను సైతం ఫొటో గ్రఫీ విపరీతంగా అలరిస్తోంది.

కంప్యూటర్‌ పరిజ్ఞానం కూడా తోడవడంతో ఫొటోగ్రఫీ ఎంతో సులువైంది. ఫొటోగ్రఫీలో ఒక ప్పుడు పురుషులు మాత్రమే ఉండేవారు.

కానీ ప్రస్తుతం పురుషు లతో సమానంగా మహిళలు కూడా ఈ రంగంపై మక్కువ కన బరుస్తున్నారు.

మీడియా రంగంలో ఉన్న అవకాశాలు, స్వయం ఉపాధికి చక్కని వేదికగా ఉండటం వల్ల పురుషులతోపాటు మహిళలు ఫొటోగ్రఫీలో రాణించడానికి ఇష్టపడుతున్నారు.

కరోనా విపరీతంగా ఉన్నప్పుడు పత్రిక ఫొటోగ్రాఫర్లు ప్రాణా లను సైతం లెక్క చేయకుండా ఆస్పత్రులు, రోగులు, పోలీసు, పారిశుధ్య కార్మికులు ఫొటోలు తీసి సమాజానికి అందించారు.

ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలకి సంబంధించిన ఫొటోలను చిత్రీకరించడం, పలు రకాల పత్రికలలో చూస్తున్నాం.

ప్రాణా లకు తెగించి ఫొటోలు తీసి తాము ఏమిటో నిరూపిస్తున్నారు. ప్రభుత్వ పథకాలలో తగిన ప్రాధాన్యత ఇచ్చి వారి విలువను పెంచాలి.

  • కామిడి సతీష్‌

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/