భవిష్యత్‌ అంతా దూరవిద్యదే!

పరిస్థితులకు ప్రత్యామ్నాయం

 future is all distance education
future is all distance education

ఇప్పుడున్న స్థితిలో ఏకోర్సు చదవాలన్నా లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టి ఎలాంటి క్లాసులు వినకుండా, ఏమాత్రం నేర్చుకోకుండా చదువుకునేందుకు విద్యార్థి అంగీకరించడంలేదు.

దూరవిద్యలో అందు బాటులో ఉన్న కోర్సులను చదివేందుకు ప్రత్యామ్నాయంగా చాలామంది విద్యార్థులు మొగ్గు చూపే అవకాశంఉందని కారణం ఫీజులు తక్కువ.

డిగ్రీకి భరోసా, కరోనా మహమ్మారి నుండి రక్షణతో పాటు చదువుకోవడానికి అన్ని విశ్వవిద్యాలయాలు కూడా కోర్సుమెటేరియల్‌ అందించడం లాంటి సదుపాయాలతో విద్యార్థి ఆకర్షణకులోనై కరస్పాండెన్స్‌ కోర్సులో ప్రవేశంపొంది తన లక్ష్యాన్ని సాధిస్తాడని.

మనదేశ యువత జనాభాను మనకున్న ఉత్పాదక వన రులనుగా భావించి వారికి కావలసిన విద్య, శిక్షణను కల్పిస్తే వారు మనదేశానికి మంచి మానవ వనరులుగా దోహదపడతారనడంలో సందేహంలేదు.

కానీ దీనికి కావలసిన చర్యలను సత్వరంగా చేపట్టా ల్సిన బాధ్యత కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాలపై ఉన్నది. కరోనా వైరస్‌ మహమ్మారి విద్యావ్యవస్థను అతలాకుతలం చేసిందనడంలో ఎలాంటి సందేహం అవసరంలేదు.

దాదాపుగా నాలుగు నెలలనుండి విద్యార్థులు చదువుకుప్రత్యక్షంగా నోచుకోక ప్రత్యామ్నాయం వైపు ఆలోచన చేయడం ప్రారంభిం చింది.

భారతదేశంలో సాంప్రదాయిక వ్యవస్థ ద్వారా కొరిక నెర వేరని, తీర్చలేని ఉన్నత విద్య కోసం ఎప్పటికప్పుడు పెరుగుతున్న డిమాండ్‌ అనుకూలంగా ఉన్నత విద్యకోసం 1962లో కరస్పాం డెన్స్‌ కోర్సుల రూపంలో ప్రారంభించబడింది.

మొదటగా ఢిల్లీ విశ్వవిద్యాలయం స్కూల్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ కోర్సులు, నిరంతర విద్య ను ప్రారంభించి దాని ఫలితాలతో దేశవ్యాప్తంగా కరస్పాండెన్స్‌ కోర్సుల విస్తరణకు శ్రీకారం చుట్టింది.

పర్యవసనంగా విశ్వవిద్యా లయ నిధుల కమిషన్‌ (యుజిసి) భారతీయ విశ్వవిద్యాలయాలలో సార్వత్రిక విద్యాప్రణాళిక ద్వారా ప్రవేశపెట్టడానికి మార్గదర్శకాలను రూపొందించింది.

ప్రతి దశకంలో కొన్ని విశ్వవిద్యాలయాలలో కర స్పాండెన్స్‌ కోర్సులను ప్రారంభించి నూతన ఒరవడి సృష్టించి అన్ని వర్గాలకు ఉన్నతవిద్య అందించి సౌకర్యవంతమైన విద్యగా తన మైలురాయిను దాటగలిగింది.

కరోనా వైరస్‌ ప్రబలిన తర్వాత రెగ్యులర్‌ విద్యకు, దూరవిద్యకు చాలాతేడా ఉందనే వాస్తవాన్ని కొంత ఆలస్యంగా అర్థం చేసుకొనే అవకాశం ఉందని గ్రహించాలి.

భారత దేశంలో దూరవిద్య వ్యవస్థ విభిన్నవర్గాలకు విద్యను అందించడానికి, అవ తరించిన ఈ ఒపెన్‌ అండ్‌ డిస్టిన్స్‌ లర్నింగ్‌(ఒడియల్‌) దాదాపుగా ఆరు దశాబ్దాలనుండి సమాజహితం కోసం దేశవ్యాప్తంగా ప్రాధాన్య తను సంతరించుకుంది.

సార్వత్రిక విద్యకు ప్రాముఖ్యత పెరిగి ఇప్పుడు 250 విశ్వవిద్యాలయాలతో అగ్ర స్థానంలో నిలిచింది. దేశంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులలో దాదాపు 25శాతం దూరవిద్యలో చదవడాన్ని చూస్తే అర్థం అవుతుంది.

విశ్వవిద్యాలయాల పరిధిని దాటి అధ్యయన కేంద్రాలు ప్రారంభించకూడదు అనే నియమ,నిబంధనలు పాటిం చాలని, అధ్యయన కేంద్రాలు పాస్‌ గ్యారంటీ పేరుతో నిబంధనలు ఉల్లంగించినట్లయితే కళాశాల అఫిలియేషన్‌ రద్దుచేస్తామని ఆదే శాలు జారీ చేయడంతో కొన్ని విశ్వవిద్యాలయాలకు అధ్యయన కేంద్రాలకు గొంతులో వెలక్కాయ పడ్డట్టు అయింది.

యూజిసి ఉన్నత విద్యలాగానే సెమిస్టర్లకు నాందిపలికింది. 2019-20 విద్యాసంవత్సరం దూరవిద్య ఆన్‌ లైన్‌విధానం ద్వారా కూడా 24కోర్సులతో, ఐదురాష్ట్రాలలో విజ యవంతంగా నడుస్తుంది.

ఉన్నతవిద్య చదువాలనే కోరికదూరవిద్య ద్వారా మాత్రమే నెరవేరుతుందని ఈ విద్యాసంవత్సరం గతసంవ త్సరంతో పోల్చుకుంటే రెగ్యులర్‌గా విద్యను అభ్యసించే యువత కూడా 15శాతంపెరిగే అవకాశంఉంది.

-డా. సంగని మల్లేశ్వర్‌, (రచయిత: జర్నలిజం విభాగాధిపతి,కాకతీయ విశ్వవిద్యాలయం)

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/