కోర్టుల్ని రాజకీయాల్లోకి లాగకండి!

తీర్పులపై వక్రభాష్యాలు వద్దు

Do not drag the courts into politics
Do not drag the courts into politics

ఏంటో ఆంధ్రప్రదేశ్‌లో నెల కొన్న గందరగోళానికి ముగింపు లేదా? జగన్‌ అధికారం చేపట్టిన నాటి నుండి హైకోర్టులో కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది.

గతంలో ఎప్పుడూ ఇలాంటి వాతా వరణం చూడలేదు. మరే రాష్ట్రంలో కూడా ఇలా ఉండదేమో! ప్రతిపనిలో అడ్డంకులే.

తీర్పులేమో ప్రభుత్వానికి అన్నీ వ్యతిరేకమే.పాలక పార్టీ కూడా తక్షణం తమ పక్షాన న్యాయ సమీక్ష చేసుకుని తప్పులుంటే సరిదిద్దుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

దాదాపు 60 కేసులకుపైగా కోర్టుల్లో వ్యతిరేక తీర్పులు వస్తే ఏ ప్రభుత్వమైనా కళ్లుమూసుకు కూర్చోరాదు.

ఇదొక కథ అయితే ఇక్కడ కేసుల్ని మరో కోణంలో కూడా చూడాలి.ప్రతి పౌరుడు, న్యాయస్థానం తీర్పుని శిరసావహించాల్సిందే. ఆ తీర్పులపై అప్పీ ల్‌కి వెళ్లేఅవకాశం ఉంటుంది.

కానీ విమర్శించే హక్కు ఎవరికీ ఉండదు. ఇక్కడ కోర్టు తీర్పులపై కొంత మంది వక్రభాష్యాలు పలకడం జరుగుతున్నది. ఇది ప్రభుత్వమే కాదు, ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే.

ఈ మధ్య కోర్టులు కూడా ఇలాంటి విషయాల్ని సీరియస్‌గా తీసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. కాకుంటే సోషల్‌ మీడియా ఫ్లాట్‌ ఫారాన్ని ఈ రోజు 90శాతం పైగా దుర్వి నియోగపరుస్తున్నారు.

ఇష్టమొచ్చిన రీతిలో కామెంట్స్‌ పెడుతున్నా రు. జగన్‌ని తుగ్లక్‌ అని ఒకరు పోస్టుపెడితే, మరొకరు చంద్ర బాబుకు కరోనా రావాలని పోస్ట్‌ చేస్తున్నారు.

కొన్నయితే చెవులతో వినలేని బూతులు.మరి కోర్టులు తమ విషయంలో పోస్టులు పెట్టిన వారితోపాటు, పెడధోరణులు పట్టించే అందర్నీ కూడా శిక్షించాలి.

ఈ ధోరణి అన్ని పార్టీలలో కూడా ఉంది. మరి కోర్టుల యినా సోషల్‌ మీడియాపై నిఘా పెట్టాల్సిన అవశ్యకత ఉంది.

అభ్యంతరకర, జుగుప్సాకర పోస్టింగ్స్‌ పెట్టే దుష్టుల్ని అరెస్టు చేసినప్పుడు న్యాయస్థానాలు పోలీసులకు అండగా ఉండాలి.

ఇదిరాష్ట్రానికే కాదు, దేశమంతటా ఈ రోజు అవశ్యం. కలుషిత రాజకీయాలకు కళ్లెం వేయాలి. అందరూ ఇందుకు తోడ్పడాలి.

పోలీసులు కూడా ఇలాంటి వ్యవహారాల్లో నిష్పాక్షికతతో ఉండాలి. ఎవరినీ ఉపేక్షించకుంటే అందరిలో ఒక రకమైన భయం అనేది ఏర్పడుతుంది. రాజకీయాలకు కుల, మతాల్ని అంటగట్ట కూడదు.

కరోనా ఆరంభం కాలంలో కూడా ఒక మతాన్ని ఒక వర్గాన్ని దోషులుగా చేస్తూ చాలా హేయమైన పోస్టింగ్స్‌ పెట్టారు. ఇలాంటి సున్నితమైన అంశాల్ని రచ్చకీడ్చి, పెట్రోల్‌తో వెలిగించకూడదు.

ఈ నెల 14 తారీఖున సుప్రీంకోర్టు ధర్మాసనం ఓ చారిత్రాత్మకమై న తీర్పు ఇచ్చింది.

సుప్రీం తీర్పులపై రెండుసార్లు విమర్శనాత్మక ట్వీట్లు చేసిన ప్రసిద్ధ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ను దోషిగా నిర్ధారించి, ఇదే నెల 20న శిక్ష అమలును తెలియచేస్తామని ప్రక టించింది.

‘ప్రశాంత్‌ భూషణ్‌ న్యాయవ్యవస్థపైన దాడి చేశారు. ఇలాంటి వ్యక్తులపై కఠినంగా వ్యవహరించకపోతే దేశ గౌరవానికి భంగం కలుగుతుందని దాని అర్థం. ధర్మాసనం తీర్పు.

ఇదొక సంచలన తీర్పు. నిజమే ఎవరూ కాదనలేం.

దీనిపై రానున్న రోజుల్లో ఎలాంటి చర్చ రేగుతుందో చూడాలి. న్యాయస్థానాల తీర్పును ఇక ఏ వ్యక్తీ విమర్శించే వీలు లేదు.

భారతదేశంలో అన్ని వ్యవస్థలు ఇప్పటికే పూర్తిగా భ్రష్టుపడ్డాయి. న్యాయవ్యవస్థ ఈ కోవలోకి ఎన్నడూ రాకూడదు.న్యాయవ్యవస్థలో కూడా కేన్సర్‌ కణం చొరబడితే ఇక దేశం అధఃపాతాళానికి పడిపోతుంది.దేశాన్ని ఆపై ఎవరూ రక్షించలేరు.

ఇక ఆంధ్రప్రదేశ్‌ అనునిత్యం కోర్టు తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావడంతో, ఈ తీర్పులపై విస్తృత చర్చ జరుగుతూ వ్ఞంది. ఎవరైనా కోర్టు తీర్పుల్ని గౌర వించాల్సిందే.కాదనలేం.

కాకుంటే ఆ తీర్పుల్ని పూర్తి రాజకీయా లకు, ప్రతిపక్షాలు వాడుకోవడం చాలా దుర్మార్గం.

ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి, న్యాయస్థానాల ఔన్నత్యానికి మంచిదికాదు. కోర్టులు న్యాయ అన్యాయాల్ని సమగ్రంగా పరిశీలించాక తీర్పులి స్తుంటాయి.పాలకుల చర్యల్లో లోపం ఉండవచ్చు.వాదనా పఠిమ లో లోపం ఉండవచ్చు.

అంతమాత్రాన అడ్డదిడ్డంగా వ్యాఖ్యలు చేయడం ఎవరికీ మంచిదికాదు. ఎవరికైనా స్వేచ్ఛతోపాటు కొన్ని హద్దులు కూడా ఉంటాయి. జడ్జీల స్థాయి తగ్గించేలా రాయకూడదు.ఎంతైనా జగన్‌మోహన్‌ రెడ్డిని 151స్థానాల్లో గెలి పించారు. అశేష ప్రజానీకం జగన్‌ను బలపరిచారు.

అలాంటి వారి నుంచి మనసుల్లో ‘న్యాయస్థానాలపై అపోహలు కలిగించేలా వార్తలు రాయరాదు. ఎడం పెంచేందుకు ప్రయత్నించరాదు.

ఎవరి ప్రయోజనాల కోసమో కోర్టులు పనిచేయవ్ఞ. ఎవరి మోహర్బానీ కోసమో కోర్టులు తీర్పులీయవ్ఞ. సంచలన వార్తల కోసం ‘జడ్జీలను ఉచ్చులోకి లాగకండి. ఇది మంచిదికాదు.

పరిణితి చెందిన సుదీర్ఘ అనుభవం ఉన్న నిష్టాగరిష్టులైన హైకోర్టు న్యాయమూర్తులు కూడా ఈ విషయాల్ని పూర్తిగా ఆలోచించక మానరు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుప్పలుతెప్పలుగా పడుతున్న విషయా ల్ని జడ్జీలు కూడా గ్రహిస్తారు.

ఎవరైనా అన్యాయంపై పోరాడాలే కానీ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కోర్టుల్లో పోరాడకూడదు. తమ రాజకీయ క్రీడలకు న్యాయస్థానాల్ని ప్లేగ్రౌండ్‌గా వాడుకోకూడదు.

న్యాయం ఎప్పుడూ తమ పక్షమేనని చంకలు గుద్దుకోకూడదు. అలాంటి ధోరణిని ఎప్పటికైనా తమకే పెనుముప్పు అవ్ఞతుంద న్నది మరవరాదు.

మహాకవి శ్రీశ్రీ ఏమన్నాడో తెలుసా! ‘న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. మరి గెలిచిందంతా న్యాయమూకాదు అర్థం అందరూ గ్రహించాలి.

రాష్ట్రం విడిపోయాక కొత్తగా ఏర్పడిన హైకోర్టు మనది. ఎన్నో కష్టనష్టాలతో కొత్త ప్రాంతంలో ఎంతో నిబ్దతతో వారు పనిచేస్తున్నారు.

వారికి కులం, మతం, ప్రాంతం లేదు.అలాంటి మహోన్నతుల మనస్సుల్ని కలుషితం చేసే ప్రయ త్నాలు, కుట్రలు, మానుకోండి.జడ్జీలు మిమ్మల్ని అర్థించేలా అర్థం వచ్చే రాయడం మానుకోండి.

కోర్టులపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యల్ని చేయకుండా అన్ని రాజకీయ పార్టీల నాయకులు తమ తమ కార్యకర్తల్ని కట్టడి చేయాలి. ప్రజాస్వామ్యంలో ఐదేళ్లకొకసారి పాలకులకు విషమ పరీక్ష ఉంటుంది.

ఆ ఎన్నికలే వాళ్ల కొనసా గింపో, ముగింపో తెలుస్తాయి. ఎన్నికైన ప్రభుత్వం ఏడాదిన్నర అయినా కాకుండానే ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలని కోరడం ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని కోరడం ఔచిత్యం కాదు. కుట్రలు, కుతంత్రాలు ఏ పార్టీ కూడా చేయకూడదు.

పత్రికలు ప్రభుత్వ పాలనకు ‘వాచ్‌ డాగ్‌లా ఉండాలే కానీ, కూలదోసేందుకు కుట్రలు చేసేలా ఉండకూడదు.

ఊహించిన విధంగా వచ్చి ప్రపం చంలోని అన్ని దేశాల ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి, లక్షల మంది ప్రాణాల్ని ‘హరీ మనిపించిన కరోనా మహమ్మారిపై సమిష్టిగా అందరం కలిసి పనిచేయాల్సిన సమయం ఇది.

ఇక్కడ రాజకీయాలు పక్కన పెట్టండి. రాలిపోతున్న తోటి మనుషుల్ని బతికించే మార్గాల్ని అన్వేషించండి. మనందరం బైటపడ్డాక తిరిగి ఒకరిపై ఒకరు బురద వేసుకునే కార్యక్రమం చేసుకోండి ప్లీజ్‌.

  • డా.విజయకుమార్‌

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/