తెలంగాణలో పెరిగిన పనివేళలు
భూముల రిజిస్ట్రేషన్లు ముమ్మరం

Hyderabad: తెలంగాణలో లాక్‌డౌన్ మినహాయింపు సమయం పెంచిన నేపథ్యంలో మంగళవారం వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు సోమవారం నుంచి ప్రారంభ మయ్యాయి. పాస్‌పోర్ట్ సేవలు మొదలు కానున్నాయి. బ్యాంకుల పనివేళలూ పెరుగనున్నాయి. మంగళవారం నుంచి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకు లు తెరిచి ఉంటాయి ఇదిలా ఉండగా , భూముల రిజిస్ట్రేషన్లు సోమవారం దాదాపు 2 వేలు జరిగాయి. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రోజుకు 24 చొప్పున చేస్తున్నారు. ఇద్దరు సబ్‌రిజిస్ట్రార్లు ఉన్న జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రోజుకు 48 వరకు అనుమతినిస్తున్నారు. స్లాట్ బుక్‌కు www.telangana. regisration.in లో లాగిన్ కావాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ పేర్కొంది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/