రేపటి నుంచి ‘మెట్రో’ సేవ‌ల సమయం పెంపుదల

మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు ప్ర‌యాణికుల‌కు అందుబాటులో

metro services in hyderabad
Metro services in hyderabad

Hyderabad: జూన్ 1వ తేదీ నుంచి మెట్రో సేవ‌ల స‌మ‌యాన్ని పెంచుతున్న‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. కాగా మంగళవారం ఉద‌యం 7 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు మెట్రో రైళ్లు ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉండ‌నున్నాయి. చివ‌రి రైలు ఒంటి గంట‌కు బ‌య‌ల్దేరి 2 గంట‌ల వ‌ర‌కు చివ‌రి స్టేష‌న్‌కు చేరుకుంటుంది. లాక్‌డౌన్ సడ‌లింపుల నేప‌థ్యంలో మెట్రో సేవ‌ల స‌మ‌యాన్ని పొడిగించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/