కోతి కరిచినందుకు ప్రపంచకప్‌కు దూరం

పోష్ స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న అండర్19 ప్రపంచకప్ నుంచి ఆస్ట్రేలియా ఓపెనర్ జాక్ ఫ్రాసర్ మెక్ గర్క్ నిష్క్రమించాడు. 17 ఏళ్ల మెక్ గర్క్‌ను కోతి కరిచింది. ముఖం మీద కూడా గాట్లు పడ్డాయి. చికిత్స కోసం స్వదేశానికి పయనమవుతున్న నేపథ్యంలో మెక్ గర్క్ ప్రపంచకప్‌కు దూరమవుతున్నాడు అని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తాజాగా ఓ ప్రకటనలో ధృవీకరించింది. చికిత్స తర్వాత మెక్ గర్క్ అందుబాటులో ఉండాడని సీఏ తెలిపింది. గత వారం ఇంగ్లండ్‌పై విజయం సాధించిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు విహారయాత్రకు వెళ్లింది. బయటకు వెళ్లిన మెక్ గర్క్‌పై అక్కడ ఉన్న ఓ కోతి దాడి చేసింది. ఈ దాడిలో అతన్ని కరవడంతో పాటు ముఖం మీద కూడా గాట్లు చేసింది. దీనికి జట్టు మెడికల్ వైద్య బృందం చికిత్స చేయడంతో భారత్‌తో మ్యాచ్‌లో ఆడాడు. అయితే ఏడు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించాల్సిన అవసరం ఉండటంతో.. మెక్ గర్క్ తిరిగి స్వదేశానికి పయనమయ్యాడు. దీంతో అండర్19 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/