శాయ్‌లో 9 కీచక కోచ్‌ల కేసులు పరిష్కారం

14లో 9 పూర్తి.. కోచ్‌లపై కఠిన చర్యలు

SAI officials act on sexual harassment cases
SAI officials act on sexual harassment cases

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(శాయ్‌)లో లైంగిక వేధింపుల గురించి మనందరికీ తెలిసిన విషయమే. కాగా 201019 మధ్య కాలంలో పరిష్కరించని 14 లైంగిక వేధింపుల కేసులలో తొమ్మిదింటిపై శాయ్‌ చర్యలు తీసుకుంది. మిగిలిన ఐదు కేసులను కూడా రాబోయే రెండు వారాల్లో పరిష్కరిస్తాం అని శాయ్‌ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. 24 అసోసియేషన్‌ల సమహారంగా ఉన్న శాయ్‌లో 45 లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయని నివేదించిన దాదాపు రెండు నెలల తరువాత కేసులు పరిష్కరించబడుతున్నాయి. శాయ్‌ అధికారులు మాట్లాడుతూ… ‘అథ్లెట్లు దాఖలు చేసిన 14 లైంగిక వేధింపుల కేసుల్లో 9 కేసులపై శాయ్‌ విచారణ జరిపింది. మూసివేయబడిన తొమ్మిది కేసులు పరిష్కరించాం. కోచ్‌లపై కఠిన చర్యలు తీసుకున్నాం. ముగ్గురు కోచ్‌లను బహిష్కరించాం. మరోకరు డిప్యుటేషన్‌లో ఉన్న కారణంగా విచారణ జరుపుతున్నాం. మరో ఐదు కేసులు పరిష్కరించే దశలో ఉన్నాయి. రాబోయే రెండు వారాల్లో వాటిని పూర్తి చేస్తాం’ అని అన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/