క్రీడాకారులకు కేంద్ర క్రీడల మంత్రి రిజిజు సలహా

వీలైనంత వరకు కరచాలనం చేయకండి

avoid-handshakes-sports-minister-kiren-rijiju
avoid-handshakes-sports-minister-kiren-rijiju

హైదరాబాద్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అథేట్లు కరచాలనానికి దూరంగా ఉండాలని కేంద్ర క్రీడల మంత్రి కిరణ్‌ రిజిజు సూచించారు. కరచాలనానికి బదులుగా నమస్కారం చేయాలని అన్నారు. ఇతరులతో మాట్లాడే సమయంలో వీలైనంత దూరంగా ఉండాలని పేర్కొన్నారు. సామాన్యులు, క్రీడాకారులకు నాదో సలహా. వీలైనంత వరకు కరచాలనం చేయకండి. అదేం తప్పనిసరి కాదు. కరచాలనానికి బదులుగా నమస్కరించండి. అని రిజిజు సూచించారు. విదేశీ టోర్నీలు, శిక్షణా శిబిరాల్లో పాల్గొనే భారత అథ్లెట్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పర్యటనల షెడ్యూల్‌ చేయాలని జాతీయ క్రీడా (ఎన్‌ఎస్‌ఎఫ్‌)లకు ఆయన సూచించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/