తెలంగాణ పోలీసుల తీరును బిజెపి తీవ్రంగా ఖండిస్తోంది

పోలీసులు టిఆర్‌ఎస్‌ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు

akula vijaya
akula vijaya

హైదరాబాద్‌: తెలంగాణ పోలీసులు టిఆర్‌ఎస్‌ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ పోలీసులు ఖాకీ చొక్కా వదిలి…పింక్ షర్ట్ వేసుకున్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు. నారాయణ కాలేజీలో బిడ్డ చేనిపోయిన తండ్రిని బూటు కాలుతో తన్నడమే బంగారు తెలంగాణనా అని ఆమె ప్రశ్నించారు. పోలీసుల తీరును బిజెపి తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ప్రజల పక్షాన నిలవాల్సిన పోలీసులు టిఆర్‌ఎస్‌ నేతలకు సలాం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఢిల్లీ పోలీసుల తీరును ట్విట్టర్‌లో ప్రశ్నించిన కేటీఆర్‌‌కు తెలంగాణ ఘటనలు కనిపించవా అని విజయ నిలదీశారు. ఆదిలాబాద్‌లో ఎస్సీ బిడ్డపై అఘాయిత్యాలు జరిగితే పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. రాష్ట్రంలో అనేక మిస్సింగ్ కేసులు నమోదు అవుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆకుల విజయ ప్రశ్నించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/