చంద్రబాబు వల్లే ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగింది

టిడిపి నేతలను, కార్యకర్తలను కేసులతో భయపెట్టాలని చూస్తున్నారు

pattipati pulla rao
pattipati pulla rao

గుంటూరు: వైఎస్‌ఆర్‌సిసి ప్రభుత్వం టిడిపి నేతలను, కార్యకర్తలను కేసులతో భయపెట్టాలని చూస్తుందని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లరావు అన్నారు. అమరావతి కోసం కలెక్టరేట్‌ ఎదుట 61 వ రోజు రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చంద్రబాబు నాయుడి ఉత్తరాంధ్ర పర్యటనను అడ్డుకోవడం వైఎస్‌ఆర్‌సిపికి సిగ్గుచేటని విమర్శించారు. హుద్‌ హుద్‌ లాంటి ఎన్నో విపత్తుల నుంచి ఉత్తరాంధ్రను కాపాడిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తు చేశారు. చంద్రబాబు వల్లే ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగిందని అన్నారు. అసలు ఉత్తరాంధ్రలో వైఎస్‌ఆర్‌సిపి నేతలకు తిరిగే హక్కు లేదని దుయ్యబట్టారు. అధికారం శాశ్వతం కాదన్న విషయం గుర్తంచుకోవాలన్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో చంద్రబాబు ఏం జరిగిన ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. చంద్రబాబును అడ్డుకుంటే తగిన మూల్యం చెలించుకోక తప్పదని పత్తిపాటి హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్‌ దుర్మార్గపు ఆలోచనలు మానుకోవాలని ఆయన సూచించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/