మూత్రం తాగాలంటూ..ప్రేమించిన వాడు వేదింపులు

కన్నవారిని సైతం దూరం చేసుకొని.. ప్రేమించి పెళ్లి చేసుకుంది..లైఫ్ ఎంతో హ్యాపీ గా ఉంటుందని కలలు కన్నది..కానీ పెళ్ళైన నెల రోజులకే ప్రేమించిన వాడు శాడిస్ట్ గా మారాడు. కట్నం తీసుకరావాలని వేధించడం..శారీర‌కంగా హింసించ‌డం..అర్థ న‌గ్నంగా కూర్చోవాల‌ని..మూత్రం తాగాల‌ని కొట్టడం వంటివి చేయడం స్టార్ట్ చేసాడు. ఇతడి వేదింపులు తట్టుకోలేక పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది.

వివరాల్లోకి వెళ్తే..

నారాయ‌ణ‌పేట జిల్లా మ‌క్త‌ల్ కు చెందిన ఓ మ‌హిళ ర‌హ‌మ‌త్ న‌గ‌ర్ కు చెందిన ఓ యువ‌కుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి త‌ర‌వాత ఆమె గ‌ర్భం దాల్చ‌గా అత్తింటివారు ఆప‌రేష‌న్ చేయించారు. ఆ త‌ర‌వాత వేధింపులు మొద‌ల‌య్యాయి. క‌ట్నం తీసుకురావాలంటూ అత్తింట్లో అంద‌రూ వేధింపులకు గురి చేయ‌డంతో ల‌క్షా యాభై వేల‌ను తీసుకువ‌చ్చి ఇచ్చింది. అయినా వేధింపులు త‌ప్ప‌క‌పోగా భ‌ర్త శాడిస్ట్ లా ప్ర‌వ‌ర్తించ‌డం మొద‌లు పెట్టాడు. శారీర‌కంగా హింసించ‌డం..అర్థ న‌గ్నంగా కూర్చోవాల‌ని..మూత్రం తాగాల‌ని సైకోలా ప్ర‌వ‌ర్తించ‌డంతో చివ‌రికి ఆ మహిళ పోలీసులను ఆశ్ర‌యించింది. జూబ్లిహిల్స్ పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేయ‌డంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద పోలీసులు కేసు న‌మోదు చేసి..అతడి ని అదుపులోకి తీసుకున్నారు.