కడపలో ఘోరం..నవ వధువు ఆత్మహత్య ..పెళ్ళైన రెండో రోజే అదనపు కట్నం కోసం వేదింపులు

కట్నం తీసుకోవడమే నేరం అంటుంటే..అదనపు కట్నం కోసం హింసించడం మరి దారుణం. ఎన్ని చట్టాలు , శిక్షలు వేస్తున్న కొంతమంది మాత్రం అదనపు కట్నం కోసం వేధిస్తూనే ఉన్నారు. మాములుగా అయితే పెళ్ళైన ఏడాది తర్వాత అదనపు కట్నం కోసం వేధించడం ఎక్కువగా చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం పెళ్ళైన రెండో రోజే అదనపు కట్నం కావాలని వేధించిన ఘటన కడప లో చోటుచేసుకుంది. ఈ వేదింపులు తట్టుకోలేక నవ వధువు ఆత్మహత్య చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే

కడప నెహ్రు నగరానికి చెందిన ఝాన్సీ (26), రాజంపేట బోయిన పల్లికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రాధాకృష్ణతో గత నెల 15న వివాహం జరిగింది. పెళ్లి సమయంలో కట్నకానుకల కింద 15 లక్షల రూపాయలు ఇచ్చారు. అయితే పెళ్లైన 2వ రోజు నుంచే అదనపు కట్నం కోసం వేధింపులు మొదలుపెట్టారు అత్తఇంటివారు. 70 లక్షలు ఇస్తేనే సంసారానికి రావాలంటూ ఈ నెల 2న అత్తా, మామలు ఝాన్సీని పుట్టింట్లో వదిలేశారు. పెద్దమనుషులు రాధాకృష్ణ ఇంటికి వెళ్లి పంచాయితీ చేశారు. తనకు 70 లక్షలు ఇస్తేనే తన భార్యను సంసారానికి తీసుకెళతానని అతడు తేల్చి చెప్పాడు. కాగా, దీన్ని తన కుటుంబ సభ్యులకు అవమానంగా భావించిన ఝాన్సీ.. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది.