న్యూ ఇయర్ వేడుకల వేళ సజ్జనార్ గుడ్ న్యూస్ తెలిపారు

TSRTC- MD-Sajjanar‌s-take-key-decisions-for-women

మరికొన్ని గంటల్లో కొత్త ఏడాది వచ్చేస్తుంది. ఈ తరుణంలో ప్రతి ఒక్కరు న్యూ ఇయర్ వేడుకలను గ్రాండ్ గా జరుపుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్ని తాకుతాయని చెప్పాల్సిన పనిలేదు. న్యూ ఇయర్ వేడుకల కోసం పలు ఈవెంట్ సంస్థలు భారీ ఎత్తున ప్లాన్లు చేయగా..సిటీ వాసులు ఆ వేడుకలలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీపి కబురు తెలిపారు. న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనే వారి కోసం ప్రత్యేక బస్సులను సిద్ధం చేసినట్లు తెలిపారు. సిటీ శివారులో ఉన్న ఈవెంట్స్ జరిగే ప్రాంతలకు బస్సు సర్వీసులు నడపబోతున్నట్లు ప్రకటించారు.

దీని కోసం ఒక్కరికి 100 రూపాయల ఛార్జ్ వసూలు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ సూచించిన 15 ప్రాంతాలకు ప్రాంతాలకు ఈ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ఈవెంట్స్ వెళ్లే వారికోసం రాత్రి 7.30 రాత్రి 9.30 వరకు, తిరుగు ప్రయాణం అర్ధరాత్రి 12.30 నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు బస్సు సౌకర్యం కల్పించనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ప్రకటన చేసింది. 18 సీట్ల ఏసి బస్సు వెళ్లి రావటానికి 4000 రూపాయలకు ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించింది ఆర్టీసీ. మరి ఈ సర్వీస్ లను ఎంతమంది ఉపయోగించుకుంటారో చూడాలి.

మరోపక్క దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కేసులకు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా తెలంగాణలో ఆంక్షలు విధించారు. జనవరి 2వ తేదీ వరకు ర్యాలీలు, సభలను నిషేధిస్తున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్వర్వులు జారీ చేశారు. కొత్త సంవత్సర వేడుకలు కూడా ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ ప్రొటోకాల్ పాటించాలని చెప్పారు.