ముందుగా రాజు మృతదేహాన్ని ఎవరు గుర్తుపట్టారంటే..

సైదాబాద్ సింగరేణి కాలనీ లో చైత్ర అనే ఆరేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి , చంపేసిన నిందితుడు రాజు..ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్ ఘనపూర్ రైల్వే ట్రాక్ ఫై అతడి డెడ్ బాడీ లభ్యమైంది. రాజుచేతిపై మౌనిక అనే పచ్చబొట్టు ఆధారంగా నిందితుడు రాజుగా పోలీసులు గుర్తించారు. గత వారం రోజులుగా వెతుకుతున్న సైదాబాద్ అత్యాచార నిందితుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. కొద్ది గంటల క్రితమే ఈ సంఘటన జరిగినట్టు సమాచారం. ముందుగా స్థానికులు మృత దేహన్ని గుర్తించి.. రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో ఆత్మహత్య వెలుగు చూసింది,

హైదరాబాద్ నుండి ప్రత్యేక పోలీసు బృందాలు పూర్తి వివరాలు సేకరించేందుకు వెళుతున్నట్టు సమాచారం. కాగా వారం రోజుల పాటు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం మాత్రం కనిపించలేదు. సీసీ కెమెరాను పరిశీలించిన పోలీసులు ఎల్‌బీ నగర్ నుండి ఉప్పల్ రింగ్ రోడ్డు వైపు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ఉప్పల్ నుండి అతడు వరంగల్ వెళ్లినట్లు అర్ధమవుతుంది. గత ఆరు రోజులుగా రాజు ఎక్కడ ఉన్నాడనేది తెలియకుండా అయిపోయింది. మొత్తం మీద రాజు మృతి..చైత్ర ఆత్మ శాంతించినట్లు చెపుతున్నారు.