నిజామాబాద్‌లో దారుణం.. వివాహిత హత్య
చిత్రవధ చేసి, పసుపు, కారం చల్లిన దోపిడీ దొంగలు

నిజామాబాద్: జిల్లాలోని ఇందూరులో దారుణం జరిగింది. ఆర్యనగర్‌లో పట్టపగలే దోపిడీ దొంగల బీభత్సం సృష్టించారు. ఓ వివాహితను దారుణం హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్యనగర్‌లో వివాహిత వరలక్ష్మీ దంపతులు ఉంటున్నారు. ఎప్పటిలాగే సోమవారం కూడా వరలక్ష్మీ ఇంట్లో ఉన్నారు. కానీ దొంగల రూపంలో ఉన్న మృగాళ్లు ఆమె ప్రాణం తీసేశారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు.. అరిచి గీ పెడుతుందనే అనుమానంతో దాడి చేశారు. గొంతుకోసి హతమార్చారు. తర్వాత కాలి మెట్టెలు కూడా తీసేందుకు వేళ్లను నరికేసి తమ పైశాచికాన్ని చాటుకొన్నారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు సహా మొత్తం ఐదు తులాల బంగారం, నగదును తీసుకెళ్లారు.
బంగారం, నగదు తీసుకెళ్తే అనుమానం వస్తుందని అనుకొన్నారే ఏమో… వరలక్ష్మీని దారుణంగా హతమార్చారు. కాలి వేళ్లను కూడా హతమార్చారు. డాగ్ స్వ్కాడ్ పోలీసులు తమను పట్టుకోవద్దనే ఉద్దేశంతో పసుపు, కారం చల్లి తెలివిగా ప్రవర్తించారు. వివాహిత మృతదేహం వద్ద దీపాలు వెలిగించారు. దోపడీ దొంగలు ఇలా చేయరని.. కేసును తప్పుదోవ పట్టించేందుకే ఇలా చేశారనే భావన వ్యక్తమవుతోంది. స్థానిక దొంగలు ఈ విధంగా ప్రవర్తించరని.. మహారాష్ట్రకు చెందిన దొంగల ముఠా ఇలా చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/