న్యూ ఇయర్ రోజు టీఎస్ ఆర్టీసీ లో ఉచిత బస్సు ప్రయాణం..

తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో ప్రకటన చేసి ఆనందం నింపారు. న్యూ ఇయర్ రోజు అనగా జనవరి 01 న 12 ఏళ్ల లోపు పిల్లలు ఉచితంగా బస్ ప్రయాణం చేసే అవకాశం కల్పించారు. న్యూ ఇయర్ రోజు పేరెంట్స్ తో కలిసి ట్రావెల్ చేసే పిల్లలకు ఫ్రీ ప్రయాణాన్ని కల్పిస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సజ్జనార్ కోరారు. అలాగే న్యూ ఇయర్ రోజు జైలుపాలు కావొద్దంటూ మందు బాబులకు ఓ విన్నపాన్ని తెలిపారు.

డిసెంబర్ 31న రాత్రి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్న తర్వాత తాగి బండి నడుపుతూ దొరికితే రూ.10 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష వేస్తామని పోలీసు శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఓ వినూత్న నిర్ణయంతో ముందుకొచ్చింది. ప్రైవేట్ వెహికల్స్ లో ప్రయాణించే బదులు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లొచ్చంటూ ఓ ప్రకటన చేసింది. సిటీలో పలు రూట్లలో న్యూ ఇయర్ రోజున ప్రజల కోసం మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సు సర్వీసులను నడపాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. ఆయా రూట్లలో రాత్రి 7.30 నుంచి 9.30 మధ్య వెళ్లడానికి, అర్ధరాత్రి 12.30 నుంచి తెల్లవారుజామున 3 గంటల మధ్య రిటర్న్ జర్నీకి ఈ బస్సులు ఉంటాయని పేర్కొన్నారు

#TSRTC has planned to operate Metro Express buses for the convenience of the public from 19:30 hrs. to 21:30 in the Up journey & from 12:30 AM to 3:00 AM in the Down journey with a flat fare of Rs 100/- per head in one way on the following routes given below#NewYear #NewYear2022 pic.twitter.com/ljsoWLk70C— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) December 30, 2021