పిఎస్‌ ఎదుట ఆత్మహత్య చేసుకున్న మహిళ మృతి

Women sucide
Women sucide

హైదరాబాద్‌: పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేయడం నగరంలో కలకలం రేపింది. అయితే ఆ మహిళ మృతి చెందింది. లోకేశ్వరి అనే మహిళ పోలీస్‌ కంప్లైంట్‌ ఇవ్వడానికి పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లింది. కొద్ది సేపటి తర్వాత తన చేతిలో ఉన్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మంటలను ఆర్పి ఆమెను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లోకేశ్వరి కాసేపటి క్రితం చనిపోయింది. గతంలో కూడా లోకేశ్వరి పలు కేసులను పంజాగుట్ట పిఎస్‌లో పెట్టినట్లు తెలిసింది. అయితే కొంతకాలంగా ప్రవీణ్‌ అనే యువకిడితో లోకేశ్వరి ప్రేమలో ఉన్నట్లు, అయితే అతడు పెళ్లికి అంగీకరించడపోవడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/