తైవాన్ రాజకీయాల్లో పెరుగుతున్న చైనా జోక్యం

చొరబాటు నిరోధక చట్టానికి చట్ట సభ గ్రీన్ సిగ్నల్

Taiwan Flag
Taiwan Flag

తైపీ: తైవాన్ ప్రభుత్వం కీలక చట్టాన్ని తీసుకొచ్చింది. తైవాన్ రాజకీయాల్లో చైనా ప్రమేయం పెరిగిపోతుండడాన్ని సహించలేకపోయిన తైవాన్ దీనికి అడ్డుకట్ట వేసింది. చైనా ప్రమేయాన్ని నిరోధించేలా తీసుకొచ్చిన చట్టానికి మంగళవారం ఆ దేశ చట్టసభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తైవాన్‌లోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన నేషనలిస్ట్ పార్టీ అభ్యర్థులకు చైనా మద్దతు ఇస్తోంది. వారి ప్రచారానికి నిధులు సమకూర్చడంతోపాటు సోషల్ మీడియాలో వారికి అనుకూలంగా మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తోందన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో దానికి అడ్డుకట్ట వేసేందుకు తైవాన్ ఖచొరబాటు నిరోధక చట్టాన్నిగ తీసుకొచ్చింది. చట్ట సభ నిన్న దీనికి ఆమోద ముద్ర వేయడంతో నేషనలిస్ట్ పార్టీ అభ్యర్థులకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు అయింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/