అశాస్త్రీయ విధానాలతో కరోనా కట్టడి జరిగేనా?

తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ ఘోరం తప్పేనా

corona cases

ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆకస్మికంగా లాక్‌డౌన్‌ ప్రకటించినప్పుడు కూడా సామాన్యులు అంత మన కోసమే అని సర్దుకుపోయారు.

భారతదేశంలో కరోనా కారణంగా హెల్త్‌ ఎమర్జన్సీ పెట్టాల్సిన అవసరం లేదని ప్రకటించిన కేంద్రమంత్రి అందుకు తగినట్టుగా తగిన జాగ్రత్తలు తీసుకొని వ్ఞంటే ఈ దుస్థితి వచ్చి వ్ఞండేది కాదు.

క రోన వైరస్‌ నివారణ చర్యలపై చైతన్యం కలిగించడంలో భాగంగా ఈ నెల 5వ తేదీ రాత్రి 9 గంటలకు విద్యుత్‌ ఆపి కొవ్వొత్తులు వెలి గించాలని ప్రధాని పిలుపు నిచ్చారు.

లాక్‌డౌన్‌కు ముందు జనతా కర్ఫ్యూ లో భాగంగా కరోనా వైరస్‌ నివా రణకు సేవలందిస్తున్న ఉద్యోగులకు అభినందనలుగా ప్రజలందరూ చప్పట్లు కొట్టాలని పిలుపు నిచ్చి నప్పుడు ప్రజలు ఎంతో సంతోషంగా ఆయన పిలునును ఆచరించారు.

కరోనా వైరస్‌ నివారణలో అన్ని రకాలుగా ప్రభుత్వం వైఫల్యం చెందుతున్న స్థితిలో కొవ్వొత్తులు వెలిగించాలని ఎందుకు పిలుపు నిచ్చారో ఏలినవారికే తెలియాలి అంటూ ప్రజలు చర్చిం చుకొంటున్నారు.

ఆ నిర్లక్ష్యానికి ఇప్పుడు సామాన్య ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారు. ప్రస్తుతం రోజురోజుకి కరోనా కేసులుపెరిగిపోతుండటంతో తమ తప్పిదాలు ఎక్కడ బహిర్గతమవ్ఞతాయో అనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం నిజాముద్దీన్‌లో జరిగిన మర్కజ్‌ సమావేశాన్ని ముందు కు తీసుకువచ్చి తప్పించుకొనే ప్రయత్నంలో వ్ఞన్నట్టుగా కనిపి స్తోంది.

మనదేశంలో కరోనా ప్రబలకుండా నివారించే అవకాశం వ్ఞన్నప్పటికీ కేంద్రప్రభుత్వం తన అశాస్త్రీయ విధానాల కారణంగా పూర్తిగా విఫలమైంది.

తమ వైఫల్యాలకు ఒక మతాన్ని, ఆ మతం తాలూకూ ప్రజలను బాధ్యులను చేసే ప్రయత్నంలో వ్ఞంది.

చైనాలో తొలిగా 2019 సంవత్సరం నవంబరు నెలలో కరోనా వైరస్‌ గుర్తించారు. వూహాన్‌ ప్రాంతంలో కరోనా చికిత్సకుగాను గంట వ్యవధిలో 1500 వందల బెడ్‌లు ఆస్పత్రి నిర్మించినప్పుడు చైనా సాంకేతిక పరిజ్ఞానం చేశారనే అంశాన్ని అందరూ విస్మరిం చారు.

అదే సంవత్సరం డిసెంబరు నాటికి కరోనా విశ్వరూపం దాల్చింది. ఐక్యరాజ్యసమితికి చెందిన వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ ప్రమాదకర పరిస్థితులను గమనించి ప్రపంచ దేశాలన్నింటిని అప్రమత్తం చేస్తూ ఈ ఏడాది జనవరి 31వ తేదీనే హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించింది.

ఈ ప్రకటనకు మన కేంద్ర ప్రభుత్వం కనీసం ప్రాధాన్యత కూడా ఇవ్వలేదు.

వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ హెల్త్‌ ఎమర్జన్సీ ప్రకటించిన 31 రోజుల తర్వాత భారత ప్రభుత్వం స్పందిస్తూ కరోనా వైరస్‌ భారత్‌లో అంత ప్రమా దకరంగా లేదని, అందువల్ల హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాల్సి అవసరం లేదని కేంద్రప్రభుత్వానికి చెందిన కుటుంబ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఆ తర్వాత మార్చి 15వ తేదీన మరో ప్రకటన చేస్తూ 250 మంది కంటే ఎక్కువ మంది ప్రజలు హాజరయ్యే సభలను, సమావేశాలను నిర్వహించ వద్దంటూ కొన్ని సూచనలు చేసింది. ఆ తర్వాత సరిగ్గా ఆరు రోజులకి ప్రధానమంత్రి మోడీ ప్రకటన చేస్తూ కరోనా నివారణకు మార్చి 21వ తేదీన ఒకరోజు జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రకటించారు.

అర్ధ రాత్రి పెద్ద కరెన్సీ నోట్ల రద్దు చేసినట్టుగానే ఆకస్మికంగా లాక్‌డౌన్‌ ప్రకటించి ప్రజలు ఎక్కడవారు అక్కడే నిలిచిపోవాలని ప్రకటించడం మినహా ప్రభుత్వం కనీసంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోలేదు.

లాక్‌డౌన్‌ ప్రకటించిన వెంటనే వివిధ రాష్ట్రాల సరిహద్దుల వద్ద వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడం, తమ గ్రామలకు వెళ్లలేక అల్లాడిపోతున్నారు. రవాణా సదుపాయాలు లేక కాలినడకన స్వగ్రామాలకు బయలు దేరిన పేదప్రజలకు ఆహారం, నీరు లభించక మార్గ మధ్యలోనే చనిపోతున్నారు.

ఒకవైపు కరోనా వైరస్‌కు సంబంధించిన అంశాలను, తీవ్రతను, మరణాల గురించి చైనా వాస్తవాలు చెప్పడటం లేదంటూ అమెరికాతోపాటు దాని మిత్రదేశాలకు చెందినవారే కాకుండా మనదేశానికి చెందిన అనేక మంది మేధావ్ఞలు వ్యాఖ్యానాలు చేశారు.

అంటే మనదేశంతో సహా అనేక దేశాలు ఒకవైపు కరోనా ఎంత ప్రమాదమో చెబుతూనే తాము కరోనా ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో వారు చేసిన నిర్తక్ష్యాన్ని అంగీకరించనట్లయింది. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ మెడికల్‌ ఎమర్జన్సీ ప్రకటించిన వెంటనే మన ప్రభుత్వం కూడా తగిన విధంగా స్పదించి వ్ఞంటే ఈ స్థితి వచ్చి వ్ఞండేది కాదు.

ప్రస్తుతం కరోనా వైరస్‌ కేసులు పెరగడానికి కారణంగా భావి స్తున్న నిజాముద్దీన్‌ సమావేశాలు మార్చి 13, 14, 15 తేదీలలో జరిగాయి.

ఈ సమావేవాలకు మనదేశానికి చెందిన కర్యాకర్తలతో పాటు 300పై చిలుకు విదేశీలు హాజరయ్యారు.విదేశీయులందరూ భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వశాఖ అనుమతి మేరకే హాజరయ్యారు.

వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనూజేషన్‌ ప్రకటించిన మెడికల్‌ ఎమర్జెన్సీని పరిగణలోకి తీసుకొని విదేశీయులకు వీసా మంజూరు చేయకుండా వ్ఞంటే బాగుండేది. కనీసం విదేశీయులు మనదేశంలో ప్రవేశించిన వెంటనే వారిని క్వారంటైన్‌కు పంపించినా ఈ సరిస్జితి దాపురించేది కాదు.

అయితే సామాన్య ప్రజల విషయంలో ఆంక్షలను లాక్‌డౌన్‌ కట్టుదిట్టంగా అమలు చేస్తున్న ప్రభుత్వాలు పెద్దలకు సంబంధించిన విషయానికి వచ్చే సరికి ఊదారంగా వ్యవహారించాయి.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆనాడు ఆకస్మికంగా పెద్దనోట్ల రద్దుచేసి అంతా పేదప్రజల కోసమే అని చెప్పినప్పుడు నమ్మి, ఆ తర్వాత ఇబ్బందులు పడినట్టుగా ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆకస్మికంగా లాక్‌డౌన్‌ ప్రకటించినప్పుడు కూడా సామాన్యులు అంత మనకోసమే అని సర్దుకుపోయారు.

కరోనా కారణంగా హెల్త్‌ఎమర్జన్సీ పెట్టాల్సిన అవసరం లేదని ప్రకటించిన కేంద్రమంత్రి అందుకు తగినట్టుగా తగిన జాగ్రత్తలు తీసుకొని వ్ఞంటే ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదు.

  • అన్నవరపు బ్రహ్మయ్య, సీనియర్‌ పాత్రికేయుడు

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/