టీఎస్‌పీఎస్సీ పేపర్‌‌ లీకేజీ కేసు… విప్రో అసిస్టెంట్ మేనేజర్ అరెస్ట్

tspsc-leakage-case-update

హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో విప్రో అసిస్టెంట్ మేనేజర్ బి.నర్సింగ్ రావును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. తర్వాత జడ్జి నివాసంలో నర్సింగ్ రావును ప్రవేశపెట్టిన అనంతరం రిమాండ్‌కు తరలించారు. దీంతో ఈ కేసులో నిందితుల సంఖ్య 47కు చేరింది. నర్సింగ్ రావు గచ్చిబౌలి విప్రోలో అసిస్టెంట్ మేనేజర్‌‌గా పని చేస్తున్నాడు. ప్రధాన నిందితుడు ప్రవీణ్‌తో నర్సింగ్‌రావుకు చాలా కాలంగా పరిచయం ఉంది. నోటిఫికేషన్ అనంతరం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) ఎగ్జామ్ రాసేందుకు నర్సింగ్‌ రావు సిద్ధమవగా, పేపర్‌‌ లీక్ విషయం గురించి ప్రవీణ్ అతనికి చెప్పాడు. దీంతో ప్రవీణ్ అందించిన మాస్టర్ పేపర్‌‌తో నర్సింగ్‌ పరీక్ష రాశాడు.