RRR కు షాక్..జగన్ కు రిలీఫ్

telangana highi court dismissed RRR pettition

ఎంపీ రఘురామకృష్ణం రాజు కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ప్రధాన నిందితుడైన ఏపీ సీఎం జగన్ బెయిలును రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. బెయిలు రద్దుకు సరైన కారణాలు లేవని తెలిపింది. జగన్ బెయిలు షరతులను ఉల్లంఘించారని చెప్పేందుకు ఒక్క ఘటనను కూడా పేర్కొనలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

జగన్‌ ద్వారా బెదిరింపులు, ప్రలోభాలకు గురైన సాక్షుల వివరాలను వెల్లడించలేదు అని కోర్టు అభిప్రాయపడింది. అధికార దుర్వినియోగానికి పాల్పడి సహ నిందితులకు కీలక పదవులను కట్టబెట్టడం ద్వారా సాక్ష్యాలను తారుమారు చేయడం.. సాక్షులను ప్రభావితం చేస్తారు అన్నవి సరైన కారణాలు కావని వ్యాఖ్యానించింది. బెయిలు రద్దు కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు 2021 సెప్టెంబరు 15న కొట్టివేసిన విషయాన్ని గుర్తు చేసింది.