పుతిన్ తో భేటీ తర్వాత బెలారస్ అధ్యక్షుడికి తీవ్ర అస్వస్థత..విషప్రయోగం జరిగిందన్న ప్రతిపక్ష నేత

నాలుగు గోడల మధ్య ఏకాంతంగా భేటీ

Poisoning? Belarus president rushed to hospital after meet with Vladimir Putin

మాస్కోః రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తో భేటీ అనంతరం బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండ‌ర్ లుక‌షెంకో తీవ్ర గుండె పోటు వచ్చింది. వెంటనే ఆయన్ను మాస్కోలోని ఓ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పుతిన్‌తో నాలుగు గంటలపాటు భేటీ తర్వాత ఈ ఘటన చోటు చేసుకోవడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. భేటీ తర్వాత కొన్ని గంటల్లోనే లుకషెంకో ఆరోగ్యం క్షీణించడంపై రష్యా అధ్యక్ష కార్యాలయం పాత్ర ఉండొచ్చని బెలారస్‌ ప్రతిపక్ష నేత వాలెరీ టెప్‌కలో అనుమానం వ్యక్తం చేశారు. లుకషెంకోపై విషప్రయోగం జరిగి ఉంటుందని ఆరోపించారు.

మరోవైపు రష్యా అధ్యక్ష కార్యాలయం పాత్ర ఉండొచ్చన్న సందేశాలు కూడా వినిపిస్తున్నాయి. లుంక షెంకో ఆరోగ్యం కొన్ని రోజులుగా సమస్యల్లో ఉన్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రక్త శుద్ధి తదితర చికిత్సలు చేయిస్తున్నట్టు సమాచారం. ప్రత్యేక వైద్య నిపుణుల పర్యవేక్షణలో ప్రస్తుతం ఆయన ఉన్నారు. ఈ నెల మొదట్లో లుక షెంకో ఓ ట్వీట్ చేశారు. ‘‘నేనేమీ మరణించడం లేదు ఫ్రెండ్స్. నాతో చాలా కాలం పాటు వేగాల్సి ఉంటుంది’’ అని ట్వీట్ చేయడం గమనార్హం.

కాగా, బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత సన్నిహితుడు. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో వీరు చాలా సేపు ఫోన్లో సంభాషించారు. అనంతరం పుతిన్‌కు పుట్టిన రోజు సందర్భంగా లుకషెంకో ప్రత్యేక బహుమతి కూడా అందించారు.