జులైలో చంద్రయాన్ – 3 ప్రయోగం: ఇస్రో ఛైర్మన్

ఈరోజు జీఎస్ఎల్వీ ఎఫ్12 ను ప్రయోగించిన ఇస్రో

Chandrayaan-3 to be launched in July this year, says ISRO chief

న్యూఢిల్లీః చంద్రుడిపై ప్రయోగాల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రయాన్ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా చంద్రయాన్ – 3 ప్రయోగం గురించి ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్ స్పష్టతను ఇచ్చారు. జులై నెలలో చంద్రయాన్ – 3 ప్రయోగం ఉంటుందని ఆయన తెలిపారు. ఈరోజు జీఎస్ఎల్వీ ఎఫ్12 రాకెట్ ను ఇస్రో విజయవంతంగా నింగిలోకి పంపిన సంగతి తెలిసిందే. ప్రయోగం సక్సెస్ అయిన తర్వాత చంద్రయాన్ గురించి సోమనాథ్ వివరాలను వెల్లడించారు. చంద్రయాన్ – 3 కి ఉపయోగించే ఎల్వీఎం రాకెట్ ను ప్రస్తుతం రూపొందిస్తున్నారు. మరోవైపు చంద్రయాన్ – 2 ద్వారా పంపిన ఆర్బిటర్ ఇప్పటికీ పని చేస్తోంది. చంద్రుడి చుట్టూ తిరుగుతున్న ఈ ఆర్బిటర్ హై రెజల్యూషన్ ఇమేజీలను పంపుతోంది.

కాగా, చంద్ర‌యాన్‌-3 స్పేస్‌క్రాఫ్ట్‌లో మొత్తం మూడు ర‌కాల మాడ్యూల్స్ ఉంటాయి. ప్రొప‌ల్ష‌న్ మాడ్యూల్‌, ల్యాండ‌ర్ మాడ్యూల్‌, రోవ‌ర్ మాడ్యూల్ ఉండ‌నున్నాయి. ఇప్ప‌టికే ఇస్రో రెండు సార్లు చంద్రుడిపైకి వ్యోమ‌నౌక‌ల‌ను పంపిన విష‌యం తెలిసిందే. బెంగుళూరులో యూఆర్ రావు శాటిలైట్ సెంట‌ర్‌లో రూపుదిద్దుకున్న మూన్ శాటిలైట్ ఇప్ప‌టికే శ్రీహ‌రికోట‌కు చేరుకున్న‌ది. ప్ర‌స్తుతం అంత‌రిక్ష కేంద్రంలో చంద్ర‌యాన్‌-3ను తీసుకువెళ్లే ఎల్‌వీఎం రాకెట్‌ను రూపొందిస్తున్నారు. ఈ స్పేస్‌క్రాఫ్ట్ మూడు వారాల్లో మూన్ వ‌ద్ద‌కు వెళ్ల‌నున్న‌ది.