శీతాకాలం- వ్యాధులు: 2
ఆరోగ్య భాగ్యం

కోరింత దగ్గు:
ఇది పిల్లల్లో కన్పించే సాధారణమైన సమస్య. ఇది బార్డడెల్లా పెట్టాసిస్ అనే బాక్టేరియలక్ష ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ప్రతి సంవత్సరం ఎన్నో కేసులు నమోదు అవుతాయి. దీనివల్ల జలుబు,
దగ్గు, జ్వరం, ముక్కు కారడం, కళ్లు నీరు కారడం, దగ్గలేక ఉక్కిరిబిక్కిరి కావడం, పిల్లకూతలు, వాంతులు, వికారం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది శరీరం నీలివర్ణంలో మారడం, బిగుసుకోవడం వుంటుంది.కోరింత దగ్గుకి వాక్సిన్ ఉంది.
చర్మ సమస్యలు :
చర్మంలో తేమతోకూడిన తైలం పొర చలిగాలికి పొడి బారుతుంది. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారిలో వాతావరణంలో తేమ తక్కువగా ఉండడం వల్ల అనేక చర్మ సమస్యలేర్పడ తాయి. చర్మపాలిపోయినట్లుండడం. పగిలిపోయి నట్లుండడం, పొడలుగా విడిపోవడం చర్మం మీద గీతలుగా మారడం దురదలు, నొప్పిగా ఉండడం, రక్తం జీరలు కన్పించడం పాదాలు, మడిమలు పగిలి ఇన్ఫెక్షన్ కల్గిస్తాయి.చలికి చాలా మంది తట్టుకోలేక ఎక్కువ వేడి
నీటితో స్నాం చేయడం వల్ల కూడా చర్మం పొడివారి మెటిమలు, ఎగ్జిమా, పొట్టులేవడం దద్దుర్లు, డెర్మటైటిస్ సొరియానెస్వంటి అనేక చర్మ సమస్యలు ఎక్కువుతాయి.
హార్ట్ ఎటాక్స్ :
ఇతర సీజన్స్ కన్నా శీతాకాలంలో హార్ట్ ఎటాక్స్ ఎక్కువగా వచ్చే అవకాశముంది. బాడీ హీట్ మెయింటెన్స్ ఎక్కువగా ఉండడం. బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నవారిలో గుండెపై వత్తిడి ఎక్కువగా ఉండడం. రక్త నాళాల్లో క్రొవ్వు పేరుకొని పోవడం ఎక్కువగా జంక్‌ఫుడ్, క్రొవ్వు పదార్థాలు తీసుకునే వారిలో, స్థూలకాయల్లో, సిగరెట్స్ త్రగే వారిలో ఎక్కువగా కన్పిస్తుంది. రక్తనాళాలు ముడుచుకొనిపోవడం వల్ల గుండెకి రక్త సరఫరా తగ్గడం, ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, శ్వాసకోశ వ్యాధు లున్న వారిలో (ఆస్ట్మ్రా, సిఓపిడి, పల్మోనరీ హైపర్ టెన్షన్) గుండెపై అదనపు ఒత్తిడి ఉండడంతో ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. వీరిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆయాసం, వికారం, ఛాతీలో అదిమివేసినట్లు లేదా పిండేసినట్లు నొప్పి రావడం, గుంజ నట్లుంటుంది. కళ్లు తిరగడం, వాంతులు కావడం, అధిక చెమటలు వంటి లక్షణాలుంటాయి.
జాయింట్ పెయిన్స్ :
గేట్, ఇన్ఫ్లమేటరీ ఛేంజ్స్, కార్టిలేజ్ దెబ్బ తినడం, అర్థ్రయిటిస్, ఇన్ఫ్ఫ్లుయెంజా, హెపటైటిస్‌తో బాధపడేవారిలో జాయింట్ పెయిన్స్ సమస్య ఎక్కువగా ఉంటుంది. కళ్లలోవాపు, నొప్పి వల్ల కదలిక సమస్యలు ఎక్కువవుతాయి. 67% మంది శీతాకాలంలో మొకాళ్ల, నడుం, మెడ నొప్పులతో బాధపడుతుంటారు.
కోల్డ్‌సోర్స్ :
చల్లగాలికి, చలికి, మంచుకి నొరు పెదవులు, పగలడం, చిన్నచిన్న దురద, నీటి పొక్కులేర్పడడం, పుండ్లు పడడం, హెర్పిస్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువవుతాయి.
ఆస్తమా: : శరీరం ఎక్కువ వేడిని గ్రహించినపుడు గుండె, లంగ్స్‌లో రక్త ప్రసరణ పెరుగుతుంది. దీని వల్ల చేతులు, భుజాలు, మోకాళ్లు ఛాతీ రక్త నాళాలు కుంచించుకోపోతాయి. దీని వల్ల అలసట, నీరసంతోపాటు శ్వాస సరిగా ఆడకపోవడం, ఛాతీ బిగుసుకొని పోవడం, ఆయాసం, పడుకోలేకపోవడం వంటి శ్వాసకోశ సమస్యలెక్కువగా ఉంటాయి. ఇది స్ట్రెస్, వంశపారంపర్యత, ఫామీలీ హిస్టరీ, నిద్రలేమి, హౌర్మోన్ల ఇంబాల్సి వల్ల ఎక్కువవుతుంది.
రేనాడ్స్ డిసీజ్ :
ఇది అరుదుగా రక్త ప్రసరణ తక్కువగా ఉన్నవారిలో కన్సిస్తుంది. అతి చల్లని, మంచు ప్రదేశాల్లో నివశించేవారిలో కాళ్లు చేతుల చివర్లు నీలి వర్ణంలోకి మారడం, తిమ్మర్లు పట్టడం, మొద్దుబాన్లుండడం వంటి లక్షణాలుంటాయి.
కార్బన్ మెనాక్సైడ్ పాయినింగ్ :
కార్బన్ మోనాక్సైడ్ రంగు, వాసన లేని గ్యాస్, దీనివల్ల 20,000 మంది అమెరికన్స్ ఎఫక్ట్ అవుతే 4,000 మంది హాస్పిటలో చేరి చికిత్స పొందుతారు 400 మంది ప్రతి సంవత్సరం చనిపోవడం జరుగుతుంది.
సైనసైటిస్:
తలలోని 4 జతల సైనస్‌లు చలికి, మంచుకి వెంటిలేషన్ లేకపోవడం వల్ల, ఇన్ప్లమేషన్కి సైనస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. దీనివల్ల తలనొప్పి, తలభారం, జలుబు, దగ్గు, గొంతులో కఫం రావడం,
ముక్కు, గొంతు కంజేషన్ వంటి లక్షణాలుంటాయి.
చెవి సమస్యలు :
జలుబు, సైనస్, వాతావరణం మార్పులవల్ల, బాక్టీరియా వైరస్ ఇన్ఫెక్షన్స్ వల్ల, స్మోకింగ్ వల్ల చెవినొప్పి,
చెవిలో చీము, కారడం చెవుడు, ఫంగస్ ఇన్ఫెక్షన్స్ రావడం చెవుల్లో అనీజీగా ఉండడం, దురదలు, శబ్దాలు, కోరు వంటి లక్షణాలుంటాయి.
-డాక్టర్. కె.ఉమాదేవి, తిరుపతి
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/