బెండకాయ 65

రుచి : వెరైటీ వంటకాలు

Taste Variety of dishes
Taste Variety of dishes

కావలసిన పదార్థాలు :

అల్లం- చిన్న ముక్క, పిచ్చిమిర్చి – 4, వెల్లుల్లి రెబ్బలు -4, బెండకాయలు – అరకిలో, సెనగపిండి-పావుకప్పు, బియ్యప్పిండి-పావుకప్పు, జీలకర్ర పొడి- ఒక టీస్పూను, మిరప కారం – ఒక టీ స్పూను, ఉప్పు- తగినంత, పల్లీలు-పావు కప్పు, గరం మసాలా – అరటీ స్పూను, పచ్చి కొబ్బరి – పావు కప్పు.

తయారు చేయు విధానం :

అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి బెండకాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టి తడి పూర్తిగా పోయాక చిన్న చిన్న ముక్కలుగా తరగాలి
ఒక ప్లేటులో బెండకాయ ముక్కలు, సెనగ పిండి, బియ్యంపిండి, జీలకర్ర పొడి, మిరపకారం, కొద్దిగా నీళ్లు వేసి కలపాలి. స్టౌ మీద బాణలిలో నూనెకాగాక పల్లీలు వేసి డీప్‌ ప్రైచేసి పక్కన ఉంచాలి అదే నూనెలో కరివేపాకు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి. అదే నూనె మరోసారి కాగా బెండకాయ ముక్కలను పకోడీలుగా వేసి, సుమారు పావు గంట సేపు వేయించి దింపాలి. గరం మసాలా, వేయించి ఉంచిన పల్లీలు, పచ్చి కొబ్బరి తురుము ఒకదాని తరవాత ఒకటి వేసి బాగాకలపాలి.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/