ముందు బాబులకు బ్యాడ్‌ న్యూస్‌..రేపు వైన్స్‌, బార్లు బంద్‌

wines-and-bars-in-hyderabad-will-be-closed-on-april-23

హైదరాబాద్‌ః మందుబాబులకు హైదరాబాద్ నగర పోలీసులు బ్యాడ్‌న్యూస్ వినిపించారు. రేపు అంటే.. 23వ తేదీన నగరవ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలు, బార్లు మూసేయాలని అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా నగర వ్యాప్తంగా ఉన్న వైన్ షాపులు, బార్లు మూసేయాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. హనుమాన్ జయంతిని హిందువులు ఎంతో ఘనంగా.. జరుపుకుంటారు. వీధి వీధినా ర్యాలీలు తీస్తూ.. హనుమ నామ జపం చేస్తుంటారు. ఈ క్రమంలో మద్యం దుకాణాలు తెరవకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించి.. ఎవరైనా దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

హనుమాన్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే సంబంధిత అధికారులు ఆయా ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే మద్యం విక్రయాలను నిలిపివేస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. పర్వదినాలు, పండుగ దినాల్లో రాష్ట్రంలో మద్యం షాపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. పర్వదినాలతో పాటు లోక్ సభ ఎన్నికలు కూడా ఉండటంతో ఎలాంటి వివాదాలు, మతపరమైన ఘర్షణలకు తావు ఉండకూడదని పోలీసు శాఖ ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.